Moviesగత జీవితపు పాత్రలో తెలుగు సినిమాలో సన్నీలియోన్...కేక..సూపర్..బంపర్!!

గత జీవితపు పాత్రలో తెలుగు సినిమాలో సన్నీలియోన్…కేక..సూపర్..బంపర్!!

తెలుగు సినిమా వాడు సాధించేశాడు. బాలీవుడ్ వాళ్ళకు కూడా చేతకాలేదు. చాలా సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు కానీ అన్నీ కూడా ఎ సర్టిఫికెట్ సినిమాలే. అంతకు మించి ముందుకు వెళ్ళలేకపోయారు. కానీ తెలుగు వాళ్ళు మాత్రం పోర్న్ బ్యూటీ సన్నీలియోన్‌కి కరెక్ట్ క్యారెక్టర్ డిజైన్ చేశారు. గుంటూరు టాకీస్ సినిమాలో శ్రద్ధాదాస్ క్యారెక్టర్ గుర్తుందిగా. ఇప్పుడు సీక్వెల్‌లో ఆ క్యారెక్టర్‌లో సన్నీలియోన్ నటించబోతోందట.

ఐడియా అదిరింది అనిపిస్తోంది కదూ…..సెక్సువల్ పర్వర్ట్ క్యారెక్టర్. అలాంటి సీన్స్‌లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన పోర్న్ బ్యూటీ. ఆల్రెడీ అమ్మడి పెర్ఫార్మెన్స్‌కి బోలెడన్ని దేశాల ప్రేక్షకులే ఫ్లాట్ అయ్యారు. ఇంకేముంది? గల్లా పెట్టె దగ్గర కాసులు లెక్క పెట్టుకోవడానికి రెడీ అయిపోవడమే. శ్రద్ధాదాస్‌ని పెట్టి రిలీజ్ చేసిన పోస్టరే దుమ్ము రేపింది. ఇక ఆ రేంజ్ పోస్టర్స్ సన్నీలియోన్‌వి రిలీజ్ చేస్తే ఫుల్ ఫ్రీ పబ్లిసిటీ కూడా. అదే సినిమా చివరలో షకీలా సినిమాల స్టైల్‌లో ఓ చిన్న మెస్సేజ్ కూడా పడేస్తే కేక. ఎవ్వరూ విమర్శించే ధైర్యం కూడా చేయరు. ఖతం. ఇలాంటి తెలివితేటలున్న ఆ తెగులు వాడికి మనమూ హ్యాట్సాఫ్ చెప్పేద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news