బాలయ్య శాతకర్ణి కోసం ఎన్టీఆర్ మరో సూపర్బ్ స్టెప్!!

balakrishna-ntr

నందరమూరి తారక రామారావు పేరుని, నందమూరి వంశాన్ని ఆ పెద్దాయన నందమూరి తారక రామారావు చేతుల మీదుగా తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి అభిమానుల కోసం, బాబాయ్ బాలయ్య కోసం మరో సూపర్ స్టెప్ ముందుకేశాడు. గౌతమీ పుత్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో మాట మాత్రంగా కూడా తనను తల్చుకోకపోయినప్పటికీ బాబాయ్ బాలయ్య పైన ఎలాంటి కోపమూ లేదని, ఆయనంటే తనకు చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయని చాటి చెప్పాడు. బాబాయ్-అబ్బాయిల మధ్య విభేదాలు ఉన్నాయని అన్నవాళ్ళందరికీ ఎన్టీఆర్ వైపు క్లియర్ ఆన్సర్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఇక బాలయ్య రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

బాలకృష్ణ వందవ సినిమా ఈ రోజు రాత్రికి అమెరికాలోనూ, రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రిలీజ్ అవనున్న నేపథ్యంలో టీం అందరికీ మనస్ఫూర్తిగా విషెస్ చెప్పాడు ఎన్టీఆర్. శాతకర్ణి సినిమా మొదటి షో పడకముందే నందమూరి అభిమానులకు, తన అభిమానులకు కూడా నందమూరి వంశం అంటే తనకు చాలా అభిమానం అన్న విషయాన్ని, బాబాయ్ సినిమాని కూడా ఆదరించాలన్న అభిలాషను వ్యక్తపరిచాడు ఎన్టీఆర్. ట్విట్టర్‌లో ఎన్టీఆర్ స్పందనపై ఆల్రెడీ ప్రశంశల వర్షం కురిపిస్తుంది. శాతకర్ణి డైరెక్టర్ క్రిష్ కూడా తారక్ ట్వీట్ చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఎన్టీఆర్‌కి థ్యాంక్యూ సో మచ్ అని చెప్పిన క్రిష్…….ప్రేమగా కౌగిలించుకోవాలని ఉంది అనే అర్థంలో ట్విట్టర్‌లో స్పందించాడు. ఎన్టీఆర్‌కి శాతకర్ణి సినిమాను ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఉంది అన్న అర్థంలో కూడా ట్వీట్ చేశాడు క్రిష్. తెలుగు జాతి చారిత్రక పురుషుడి వంశమయిన నందమూరి కోసం ఎన్టీఆర్ ప్రయత్నాలను అందరూ అభినందించాల్సిందే మరి. ఏమంటారు? హ్యాట్సాఫ్ టు యు ఎన్టీఆర్.

More from my site