ఎన్టీఆర్ మూవీలో మోక్షజ్ఞ.. చరిత్ర సృష్టించడానికి సిద్ధం..!

65

నందమూరి వారసుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రంకు రంగం సిద్ధమవుతుంది. అసలైతే క్రిష్ డైరక్షన్ లో మొదటి సినిమా ప్లాన్ చేయగా అది ఎందుకో ముందుకు కదలలేదు. ప్రస్తుతం క్రిష్ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ వస్తుంది. బాలకృష్ణ తన తండ్రి పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.

తాత బయోపిక్ తో మనవడి తెరంగేట్రం చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ దాదాపు 60 గెటప్పులలో కనిపిస్తాడట. అయితే టీనేజ్ లో ఎన్.టి.ఆర్ గా మోక్షజ్ఞ కనిపించే అవకాశాలు ఉన్నాయట. తప్పకుండా మోక్షజ్ఞకు ఇది క్రేజీ మూవీ కానుందని చెప్పొచ్చు.

ఇప్పటికే దీనికి సంబందించిన ఫోటో షూట్ మొదలుపెట్టారట. సినిమా పూర్తయ్యాక రిలీజ్ దాకా మోక్షజ్ఞ లుక్ బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారట. ఎన్.టి.ఆర్ గా మోక్షజ్ఞ ఎలా ఉంటారో చూడాలని నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Leave a comment