” అరవింద సమేత ” ఫస్ట్ డే కలక్షన్స్..!షాక్ లో సినివర్గం..!

133

ఎన్.టి.ఆర్ వీర రాఘవ రెడ్డిగా విధ్వంసాన్ని సృష్టించడానికి వచ్చిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఎలాంటి సినిమా ఆశిస్తారో ఆ అంచనాలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతూ ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా వసూళ్ల హంగామా మొదలైందని చెప్పొచ్చు. ఓవర్సీస్ లో ఈమధ్య మంచి జోరు కనబరుస్తున్న ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమా ద్వారా 225 లొకేషన్స్ లో 800లే డాలర్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.

ఇక నైజాం లో కూడా మొదటి రోజు 8.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. ఇక సీడెడ్లో రూ. 5.3కోట్లు షేర్ అయ్యాయి. గుంటూరు జిల్లాలో రూ. 4,14కోట్లు, కృష్ణ జిల్లాలో 2.08 కోట్లు షేర్, నెల్లూరు రూ.1.06కోట్లు, యూఎ రూ. 3.12కోట్లు నిజాం, సీడెడ్, గుంటూరు, కృష్ణా , నెల్లూరు, యూఎ కలిపి మొత్తం సుమారు రూ. 21.6కోట్లు రాబట్టింది అరవింద సమేత. ఫస్ట్ డే కలక్షన్స్ లో అరవింద సమేత దుమ్ముదులిపేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సునీల్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. భారీ అచనాలతో వచ్చిన ఈ సినిమా వసూళ్లు కూడా భారీగా ఉన్నాయి. ఏరియాల వారిగా కలక్షన్స్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a comment