Moviesఆ తప్పు మేము చేయలేదు అంటూ చెప్పడానికి తెగ కష్టపడి పోతున్న...

ఆ తప్పు మేము చేయలేదు అంటూ చెప్పడానికి తెగ కష్టపడి పోతున్న మెగా ఫ్యామిలీ .. మీరు గమనించారా..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో మెగా ఫ్యామిలీని మరోసారి ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు . ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన నెగిటివ్ వార్తలు ఎలా మనం వింటున్నామో మనకు బాగా తెలుసు . నిద్రలేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక కారణంగా ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం. తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక సంబంధించిన ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది .

నిహారిక విడాకులు తర్వాత జెడ్ స్పీడ్ లో తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుంది . ఆమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసింది . ఈ బ్యానర్ ద్వారా తెరకెక్కుతున్న ఫస్ట్ మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ ను ప్రకటించడానికి ఉగాది రోజును చూస్ చేసుకుంది . ఆ టైటిల్ ప్రకటించబోయేది మరెవరో కాదు సాయిధరమ్ తేజ్ . ఇదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది నిహారిక .

చాలా వెరైటీగా కార్డ్ ని డిజైన్ చేస్తూ ఆ కార్డుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . అయితే ఇదే విషయం కారణంగా మరోసారి నిహారికను ఆడేసుకుంటున్నారు జనాలు. మెగా ఫ్యామిలీ నిహారిక విషయంలో తప్పు చేయలేదు.. ఆమె టాలెంటెడ్ ..విడాకులు తీసుకొని మంచి పనే చేస్తుంది.. ఆడవాళ్లు వాళ్ళ కాళ్ళ మీద వాళ్లు బ్రతకాలి ..నిహారిక విడాకుల విషయంలో మేము ఏ తప్పు చేయలేదు ..ఆమె ఇష్టా ఇష్టాలను గౌరవిస్తున్నాం అని చెప్పడానికి నిహారిక చేత ఇలాంటి పనులు చేయిస్తున్నారు మెగా ఫ్యామిలీ అంటూ కొందరు ట్రోలర్స్ గట్టిగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో ఈ విషయం ఇప్పుడు నెట్టింట అదే విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news