Moviesఆ రుచికి బాగా అలవాటు పడ్డ రాజమౌళి .. ఇక ఈయనని...

ఆ రుచికి బాగా అలవాటు పడ్డ రాజమౌళి .. ఇక ఈయనని ఆపడం ఆ దేవుడి తరం కూడా కాదు రా బాబోయ్..!

రాజమౌళి .. టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసిన డైరెక్టర్ . బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఖ్యాతినీ ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన డైరెక్టర్ ..ఎవరు అనగానే అందరూ చెప్పే ఒకే ఒక్క పేరు రాజమౌళి . అభిమానులు ముద్దుగా జక్కన్న అంటూ పిలుచుకుంటూ ఉంటారు . రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు ఇప్పటివరకు ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు అన్న విషయం మనకు తెలిసిందే.

ఆయన జనాలను నాడిని పట్టుకుని సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు . అందుకే ఆయన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి. ఆయన ఆఖరిగా డైరెక్ట్ చేసిన సినిమా ఆర్ఆర్ఆర్ . ఈ సినిమా కోట్లాదిమంది ఇండియన్స్ ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుని సైతం ఇండియాకు తీసుకొచ్చింది . ప్రజెంట్ మహేష్ బాబు తో ఒక భారీ అడ్వెంచర్స్ మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు . అయితే రీసెంట్గా ఈ మధ్యకాలంలో రాజమౌళి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు .

రాజమౌళి తన భార్య రమాతో కలిసి చేసిన డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేసింది . అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై అనే పాటకు రాజమౌళి రమా ఇద్దరు కూడా చాలా వెరైటీగా ఫన్నీగా స్టెప్స్ వేశారు . అయితే తాజాగా ఈ డాన్స్ రిహార్సిల్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కొంతమంది ఆకతాయిలు ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు . ఎప్పుడు ఇదే పనా..? ఇక సినిమాలు తెరకెక్కించవా అంటుంటే మరికొందరు మీరు మల్టీ టాలెంటెడ్ సార్ అంటూ పొగిడేస్తున్నారు . మరి కొంతమంది నువ్వు కూడా సోషల్ మీడియాలో పబ్లిసిటీ పాపులారిటీ పిచ్చికి బలైపోతున్నావు చూసుకో రాజమౌళి అంటూ సజెస్ట్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ రాజమౌళి రమాకు సంబంధించిన ఈ వీడియో బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news