Movies"టిల్లు స్క్వేర్" చూసి "దేవర" లో కూడా కొరటాల అలా చేయబోతున్నాడా..?...

“టిల్లు స్క్వేర్” చూసి “దేవర” లో కూడా కొరటాల అలా చేయబోతున్నాడా..? పెద్ద రిస్కే చేస్తున్నాడే..!

ఈ మధ్యకాలంలో జనాలు కాన్సెప్ట్ కన్నా కామెడీని ఎక్కువగా లైక్ చేస్తున్నారు. ఎన్ని కోట్ల బడ్జెట్ సినిమా అయినా సరే ఆ మూవీలో కామెడీ ఉంటే సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసేస్తున్నారు. ఆ విషయం మనం పలు సినిమాలు చూసినప్పుడు ఈజీగా అర్థమయిపోతుంది . ప్రెసెంట్ అదే స్ట్రాటజీని ఫాలో అవ్వడానికి చూస్తున్నాడు కొరటాల శివ అంటూ ప్రచారం జరుగుతుంది . ఆచార్య లాంటి బిగ్ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఓకే చేసుకున్న సినిమా దేవర.

ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమాను ఓకే చేశాడు. ఈ సినిమా కోసం ఏడు కేజీల బరువు తగ్గాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ని రంగంలోకి దించాడు కొరటాల శివ . ఈ సినిమా మొత్తం కూడా రివెంజ్ డ్రామా ఫ్యామిలీ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే రీసెంట్గా టిల్లు స్క్వేర్ సక్సెస్ ఈవెంట్లో పాల్గొన్న ఎన్టీఆర్ కామెడీ ఉంటే సినిమా హిట్ అవుతుంది అని నవ్వించడం చాలా చాలా కష్టమైన పని అని ఓ రేంజ్ లో మాట్లాడేసారు .

ఈ క్రమంలోనే కొరటాల శివ కూడా మనసు మార్చుకున్నారట . తమ సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్ పెంచడానికి కొన్ని కామెడీ క్లిప్స్ ను కామెడీ సీన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారట. గబ్బర్ సింగ్ సినిమాలో ఎలా అయితే అంత్యాక్షరి సీన్స్ ఉంటాయో.. దేవరలో కూడా ఎన్టీఆర్ చేత అలాంటి కొన్ని కామెడీ సీన్స్ చేయించబోతున్నారట .

పాన్ ఇండియా లెవెల్ లో పబ్లిసిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ చేత అలాంటి సీన్స్ చేస్తే జనాలు ఎంకరేజ్ చేస్తారా..? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . సక్సెస్ అయితే ఓకే ఫ్లాప్ అయితేనే ఎన్టీఆర్ కి అదేవిధంగా కొరటాల శివాకి భారీ బొక్క అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news