Moviesతూచ్..తూచ్..దేవరలో ఒకరు కాదు ఇద్దరు ..హీట్ పెంచేస్తున్న లేటెస్ట్ లీక్డ్ న్యూస్..!

తూచ్..తూచ్..దేవరలో ఒకరు కాదు ఇద్దరు ..హీట్ పెంచేస్తున్న లేటెస్ట్ లీక్డ్ న్యూస్..!

ఇది నిజంగా నందమూరి అభిమానులకు ఎగిరి గంత్తేసే న్యూస్ అని చెప్పాలి . లడ్డు కావాలా నాయనా అన్న రేంజ్ లో ఒక లడ్డు కాదు రెండు లడ్డులు చేతికి ఇస్తున్నాడు కొరటాల శివ. ఇన్నాళ్లు దేవర సినిమాలో ఐటమ్ సాంగ్ ఒక హీరోయిన్ నే నటించబోతుంది అనుకున్నారు . అయితే ఐటెం సాంగ్ లో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు అంటూ ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది . ప్రెసెంట్ ఆ న్యూస్ విని నందమూరి అభిమానులు దేవరా సినిమా హాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు .

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా దేవర . కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది . జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించబోతుంది . అందుతున్న సమాచారం ప్రకారం జాన్వి కపూర్ ఈ సినిమాలో చనిపోతుందట . ఈ సినిమాలో శ్రీకాంత్ – జాన్వి కపూర్ తండ్రిగా కనిపించబోతున్నాడు . పలువురు స్టార్ నటులు కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది .

ఒక్కొక్క పాత్రకు సంబంధించి సపరేట్ సపరేట్ క్యారెక్టర్స్ ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడట కొరటాల శివ. ఈ సినిమాలో ఐటెం సాంగ్ పూజ హెగ్డే నటించబోతున్నట్లు గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే కేవలం పూజ హెగ్డే మాత్రమే కాదు .. ఈ పాటలో కాజల్ అగర్వాల్ కూడా కనిపించబోతుంది అంటూ లేటెస్ట్ బజ్ ట్రెండ్ అవుతుంది.

కొరటాల శివ ఇది చాలా సర్ప్రైజ్ గా ప్లాన్ చేశారట . ఫస్ట్ ఒకటిన్నర నిమిషం పాటు పూజా హెగ్డే కనిపిస్తుంది అని.. ఆ తర్వాత పూజ హెగ్డే తో పాటు కాజల్ అగర్వాల్ కూడా కనిపించబోతుంది అని .. అదేవిధంగా మధ్యలో జాన్వి కపూర్ కూడా యాక్ట్ చేయబోతున్నారు అంటూ ఓ న్యుస్ వైరల్ గా మారింది . సాధారణంగా ఒక స్టార్ హీరో పక్కన ఒక హాట్ బ్యూటీ ని చూస్తేనే తట్టుకోలేం. మరి అలాంటిది ముగ్గురు హాట్ బ్యూటీస్ మధ్యలో తారక్ అది కూడా మాస్ రేంజ్ స్టెప్స్ ..ఇక నందమూరి ఫ్యాన్స్ ని ఆపగలమా..? అమ్మ బాబోయ్ అస్సలు పట్టలేకపోతున్నాము.. ఇక థియేటర్లో ఈ పాట చూస్తే రచ్చ రంబోలానే అంటున్నారు ఫ్యాన్స్..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news