Moviesఇట్స్ రివెంజ్ టైం.. తనలోని మరో యాంగిల్ ను బయటపెట్టిన నాగచైతన్య.....

ఇట్స్ రివెంజ్ టైం.. తనలోని మరో యాంగిల్ ను బయటపెట్టిన నాగచైతన్య.. దెబ్బ అదుర్స్ రా అబ్బాయ్..!

నాగచైతన్య.. అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా ..అక్కినేని నాగార్జున గారి కొడుకుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . అయితే హీరోగా సక్సెస్ కాలేకపోయాడు . చిన్నాచితకా సినిమాలు ఓకే కానీ భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో 100 కోట్లు సినిమా అని మాత్రం ఇప్పటివరకు నాగచైతన్య కెరియర్లో చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క మూవీ కూడా లేదు . త్వరలోనే ఆ కోరికను తీర్చేయబోతుంది తండేల్ సినిమా అంటూ ప్రచారం చేస్తున్నారు అక్కినేని అభిమానులు .

చందు మండేటి దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న సినిమా నే ఈ తండేల్. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే మూడో షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది . తాజాగా నాగచైతన్యకు సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . నాగచైతన్య అంటే సాఫ్ట్ హీరో అని అనుకున్నారు అంతా.. కాదు కాదు కాదు నాలోనూ బోల్డ్ యాంగిల్ ఉంది .. వైలెంట్ గా మారుతాను అంటూ ప్రూవ్ చేసుకుంటున్నాడు నాగచైతన్య.

గతంలో ఆయనకు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన మజిలీ డైరెక్టర్ శివనిర్వాణకు హ్యాండ్ ఇచ్చాడు అన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. నాగచైతన్య సమంత హీరో హీరోయిన్లుగా శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ సినిమా నాగచైతన్య కెరియర్నే మలుపు తిప్పింది. ఆ తర్వాత వీళ్ళ కాంబోలో ఒక సినిమా రావడానికి మాట్లాడుకున్నారు. కొన్ని కారణాల చేత ఆ సినిమా ఆలస్యం అయితే వచ్చింది.

ఇప్పుడు నాగచైతన్యతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు శివ నిర్వాణ. కానీ నాగచైతన్య మాత్రం శివనిర్వాణకు హ్యాండ్ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు జనాలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం నాగచైతన్య శివనిర్వాణకు కాల్ షీట్స్ ఇవ్వడం లేదట . అంతేకాదు ఆ కాల్ షీట్స్ ను వేరే వాళ్ళకి కూడా కమిట్ అయిపోయాడట. విరూపాక్ష డైరెక్టర్ తో నాగచైతన్య సినిమా చేయబోతున్నాడు అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది . శివనిర్వాణ ఖుషి సినిమాలో సమంత ను అంత హాట్గా చూపించాడు ..ఇప్పుడు దానికి రివేంజ్ టైం అంటూ అక్కినేని ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news