Moviesమెగా ఇంటికి కొత్త అల్లుడు రాబోతున్నాడా..? నిహారిక పోస్టుకు అర్థం అదేనా..?

మెగా ఇంటికి కొత్త అల్లుడు రాబోతున్నాడా..? నిహారిక పోస్టుకు అర్థం అదేనా..?

మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అవుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాగబాబు కూతురు నిహారిక కు సంబంధించిన వార్తలు మరింత స్థాయిలో ఎక్కువగా వైరల్ గా మారాయి . దానికి కారణం ఏంటో కూడా మనకు తెలుసు. నిహారిక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్నింది. వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంది .

ఈ విషయం అందరికీ తెలిసిందే. విడాకుల తర్వాత కెరీర్ ను జెడ్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్ళి పోతుంది . ఒకపక్క సినిమాలను నిర్మిస్తూ మరొక పక్క సినిమాల్లో యాక్ట్ చేస్తూ బిజీ బిజీగా వెళుతుంది . సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటుంది . రీసెంట్గా నిహారిక సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది . రెండు జంట ఏనుగులు దగ్గరగా ఉన్న ఫోటో షేర్ చేసి హార్ట్ సింబల్ ని పెట్టింది .

దీనితో అందరూ ఆమె మళ్ళీ ప్రేమలో పడింది అంటూ పుకార్లు పుట్టించేశారు. నిహారిక నిజంగా ప్రేమలో పడిందా ..? లేదా..? తెలియదు కానీ ఈ విషయం బాగా వైరల్ అవుతుంది. కొంతమంది మెగా ఇంటికి అల్లుడు రాబోతున్నాడు అని నిహారిక లైఫ్ లో కొత్త పర్సన్ వస్తున్నాడు అని ..సింబాలిక్ గా ఇలా చెప్పింది అంటూ కథలు అల్లేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news