Moviesఇండస్ట్రీలో ఆ దమ్మున్న మగాడు విజయ్ దేవరకొండ మాత్రమే .. లేకపోతే...

ఇండస్ట్రీలో ఆ దమ్మున్న మగాడు విజయ్ దేవరకొండ మాత్రమే .. లేకపోతే ఇలాంటి నిర్ణయం ఎవరు తీసుకుంటాడు చెప్పండి..!!

విజయ్ దేవరకొండ ..ఈ పేరు చెప్తేనే మనకి బ్యాక్ గ్రౌండ్ లో తెలియకుండానే రై రై మంటూ మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది . మరీ ముఖ్యంగా నేటి యువతకు విజయ్ దేవరకొండ అంటే పిచ్చి – క్రష్ – మెంటల్.. ఎన్ని చెప్పుకున్నా తక్కువే . విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు . అబ్బాయిల సంగతి పక్కన పెట్టండి .. అమ్మాయిలు అయితే ఏకంగా వీపుపై ఆయన బొమ్మను కూడా టాటూ వేయించుకుంటున్నారు .

అంతలా పిచ్చి పట్టేసింది అమ్మాయిలకు విజయ్ దేవరకొండ అంటే . బెల్లం చుట్టూ ఈగలులా ఎప్పుడు ఆయన ఎక్కడ ఉన్న ముసురుకుంటూనే ఉంటారు. విజయ్ దేవరకొండకు ఇంతటి స్టార్డం రావడానికి కారణం అర్జున్ రెడ్డి . ఈ సినిమాలో అర్జున్ పాత్రలో విజయ్ నటించి ఆటిట్యూడ్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు . పెళ్లిచూపులు సినిమాతో క్లాస్ హీరోగా తనదైన స్టైల్ లో ట్యాగ్ చేయించుకున్నారు .

ఇప్పుడు విజయ్ దేవరకొండ మాస్ హీరోగా తన ఇమేజ్ కొనసాగించడానికి సంచలన నిర్ణయం తీసుకున్నాడు . స్కంద సినిమాతో అట్టర్ ప్లాప్ అందుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడట . దీనికి సంబంధించిన వార్త ఫిలిం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . విజయ్ దేవరకొండ లాంటి క్లాస్ హీరో ఎవరన్నా టు మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తే అది రచ్చ రంబోలానే .. ఈ కాంబో కోసం ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అంతేకాదు డైరెక్టర్స్ బ్యాక్ గ్రౌండ్ చూడకుండా హిట్ ట్రాక్ చూడకుండా అవకాశాలు ఇచ్చే ఏకైక దమ్మున్న మగాడైన హీరో విజయ్ దేవరకొండ మాత్రమే అంటూ ఫ్యాన్స్ ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news