సాయి పల్లవి .. ఒంట్లో స్ప్రింగులు పెట్టుకొని ఉందా ..? అని డౌట్ రాకమానదు. అలా తన బాడీని గిరగిరా తిప్పేస్తూ ఉంటుంది . వామ్మో ఈ సాయి పల్లవి ఏంట్రా బాబు ఇలా తయారైపోయింది అంటున్నారు జనాలు . నిన్న మొన్నటి వరకు చాలా పద్ధతిగా మెరిసిన సాయి పల్లవి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో మస్తు మస్తు షేడ్స్ చూపిస్తుంది. ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది. మనకు తెలిసిందే సాయి పల్లవి ప్రెసెంట్ జపాన్ లో ఉంది.
ఓ సినిమా కోసం ఆమె ఫారిన్ కంట్రీస్ లో కొన్ని నెలలుగా గడుపుతుంది . రీసెంట్ గా హీరోయిన్ సాయి పల్లవి కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సాయి పల్లవి ఎక్కడుంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది . ఈ విషయం అందరికీ తెలుసు . అమీర్ ఖాన్ కొడుకుగా పరిచయం అవుతున్న సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఈ మూవీ షూటింగ్ జపాన్లో జరుగుతుంది .
ఈ క్రమంలోనే అక్కడ ఓ పార్టీలో సాయి పల్లవి రెచ్చిపోయింది. మూవీ టీం తో కలిసి డాన్స్ చేసింది . మామూలు డాన్స్ కాదు షారుఖ్ ఖాన్ రేంజ్ లో స్టెప్స్ వేసింది . ఒకే అమ్మాయి కావడంతో సాయి పల్లవి హైలెట్ గా మారిపోయింది . టీం లో ఒకరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ట్రెండ్ అవుతుంది. సాయి పల్లవి స్టెప్స్ కు జనాలు ఫిదా అయిపోతున్నారు.
ప్రజెంట్ సాయి పల్లవి పలు సినిమాలలో బిజీగా ఉంది . కోలీవుడ్లో శివ కార్తికేయన్ తో సినిమాతో పాటు.. తెలుగులో నాగచైతన్యతో తండేల్ అనే సినిమాలో కూడా నటిస్తుంది..!!
Queen Sai Pallavi Dance at #EkDin japan schedule wraps up party 🥹♥️#SaiPallavi @Sai_Pallavi92 #Japan pic.twitter.com/j10iQTYQqd
— Sai Pallavi FC™ (@SaipallaviFC) March 8, 2024