Moviesఆ సూపర్ డూపర్ నాగార్జున హిట్ సినిమాకి సీక్వెల్ రాబోతుందా..? ...

ఆ సూపర్ డూపర్ నాగార్జున హిట్ సినిమాకి సీక్వెల్ రాబోతుందా..? ఇక ఈ ఆడోళ్లని ఆపలేం రా బాబోయ్..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ లేడీస్ అందరూ ఎక్కువగా లైక్ చేసే హీరో మాత్రం అక్కినేని నాగార్జున . క్లాస్ – మాస్ – కమర్షియల్ అన్ని ఎలిమెంట్స్ సినిమాలో నటించడం నాగార్జున స్పెషాలిటీ . అక్కినేని నాగార్జున ఎంతమంది అమ్మాయిల మనసులను కొల్లగొట్టాడో.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతెందుకు మన ఇండస్ట్రీలోని స్టార్ హీరోల భార్యలు వాళ్ళ కూతుర్లు కూడా అక్కినేని నాగార్జున అంటే పడి చచ్చిపోతూ ఉంటారు.

ఈ విషయాన్ని స్వయాన వాళ్లే పలు ఈవెంట్స్ లో అనౌన్స్ కూడా చేశారు . కాగా రీసెంట్గా అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది . అక్కినేని నాగార్జున కెరియర్ లోనే వన్ ఆఫ్ ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన మన్మధుడు సినిమాకి సీక్వెల్ రాబోతుందట. ఆల్రెడీ మన్మధుడు 2 వచ్చేసింది . అయితే ఆ సినిమా పెద్దగా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది.

అయితే ఈసారి మాత్రం ఎక్సాట్ గా గతంలో హిట్టైనా మన్మధుడు సినిమా లాగానే స్టోరీని తెరకెక్కించాలి అని డిసైడ్ అయ్యారట. రీసెంట్ గానే అన్షు అంబానీ నాగార్జునని కలిసింది. వీటికి సంబంధించిన పిక్చర్స్ కూడా వైరల్ అయ్యాయి . ఈ మూమెంట్ లోనే మన్మధుడు 3 కి సంబంధించి త్వరలోనే అనౌన్స్మెంట్ రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఈ సినిమా గాని వస్తే ఇక లేడి ఫ్యాన్స్ ని ఆపగలమా అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news