Moviesకెరీర్ లో ఫస్ట్ టైం ఇలా.. ఎన్టీఆర్ కోసం అలా చేస్తున్న...

కెరీర్ లో ఫస్ట్ టైం ఇలా.. ఎన్టీఆర్ కోసం అలా చేస్తున్న జాన్వికపూర్ .. నందమూరి అభిమానులు ఫిదా..!!

జాన్వి కపూర్ .. శ్రీదేవి ముద్దుల కూతురుగా సినిమా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితురాలు. తనదైన స్టైల్ లో హాట్ హాట్ అందాలను ఆరబోసే జాన్వి కపూర్ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది. ఆమె బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా హిట్ కొట్టలేకపోయింది . కాగా టాలీవుడ్ లో ఆమె ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా ..? అంటూ జనాలు ఈగర్ గా వెయిట్ చేశారు .

ఫైనల్లీ నందమూరి జూనియర్ ఎన్టీఆర్ తో ఆమె తన డెబ్యూ సినిమాను ఫైనలైజ్ చేసుకుంది. దేవర సినిమాతో ఆమె తెలుగు తెరపై కనిపించబోతుంది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . సినిమా గురించి అభిమానులతో కొన్ని విషయాలను పంచుకునింది జాన్వి కపూర్ . దేవర కోసం ఓపెన్ గా తాను చేస్తున్న పనులు చెప్పుకు వచ్చింది.

తెలుగు రాని జాన్వి కపూర్ ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుందట. అంతేకాదు ఆమె తెలుగు నేర్చుకుని.. మరి ఒక్క ఇంగ్లీష్ పదం వాడకుండా న్యాచురాలిటీగా.. ఉండే తెలుగును తనదైన స్టైల్ లో మాట్లాడబోతుందట . ఇది తెలుసుకున్న అభిమానుల ఫిదా అయిపోతున్నారు . ఈరోజుల్లో హీరోయిన్ ఎలా ఉన్నారో తెలిసిందే.. జాన్వి డబ్బింగ్ కోసం ఇంత కష్టపడుతుంది అంటే కారణం మాత్రం ఎన్టీఆర్ పై ఉన్న అభిమానమే అంటున్నారు.. జాన్వి కపూర్ కి ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టమని .. తనను నమ్మి ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ సినిమా హిట్ అవ్వడానికి ఎంతటి కష్టమైనా పడతాను అని ఇలాంటి నిర్ణయం తీసుకుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news