Moviesరకుల్ పెళ్లి చేసుకుంటున్న గోవాలోని రిసార్ట్ ఒక్క రోజు రెంట్ ఎంతో...

రకుల్ పెళ్లి చేసుకుంటున్న గోవాలోని రిసార్ట్ ఒక్క రోజు రెంట్ ఎంతో తెలుసా.. బాబోయ్ అన్ని కోట్లా..?

రకుల్ ప్రీత్ సింగ్.. మరి కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకోబోతుంది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్ . ఫిబ్రవరి 21న పెళ్లి చేసుకోబోతుంది . గత కొంతకాలంగా ప్రేమాయణంలో మునిగి తేలిన ఈ జంట ఫైనల్లి మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ముందుగా విదేశాలలో వెడ్డింగ్ డెస్టినీను ప్లాన్ చేసుకున్నారు . కానీ ఆ తర్వాత తమ మనసు మార్చుకున్నారు . గోవాలోని లగ్జరీ హోటల్లో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు ఈ లవ్ బర్డ్స్ . సౌత్ గోవాలోని ఐటిసి గ్రాండ్ హోటల్లో రకుల్ – జాకీ పెళ్లి ఫిబ్రవరి 21న గ్రాండ్గా జరగబోతుంది .

ఫిబ్రవరి 19 నుంచి పెళ్లికి సంబంధించిన వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే అక్కడ పెళ్ళికి సంబంధించిన పనులు ప్రారంభించేసింది రకుల్ ప్రీత్ సింగ్ . ప్రతి విషయాన్ని తానే దగ్గర ఉంటూ చూసుకుంటూ .. తన పెళ్లికి అన్ని పనులు చేసుకుంటుంది . కాగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోబోయే రిసార్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . ఇది చాలా చాలా కాస్ట్లీ అని అత్యంత ధనవంతులు మాత్రమే ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోగలరని ..అంత స్పెషాలిటీ ఈ రిసార్ట్ కి ఉంది అని చెప్పుకొస్తున్నారు.

గోవాలోని ఐటిసి గ్రాండ్ రిసార్ట్ 45 ఎకరాలలో విస్తరించింది. ఈ హోటల్లో మొత్తం 246 గదులు ఉంటాయి . ప్రతిదీ కూడా లగ్జరీయస్.. చిటికలో ఏదైనా సరే చేసేయొచ్చు.. వాళ్ళు అడిగింది వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. అంతేకాదు నో పొల్యూషన్ చుట్టూ ప్రశాంతమైన వాతావరణం.. కొబ్బరి చెట్లు ..ఈ రిసార్ట్ కు అతిపెద్ద ప్లస్ పాయింట్ . మేక్ మై ట్రిప్ ప్రకారం గోవాలోని ఐటిసి గ్రాండ్ హోటల్ లో ఒక గది ధర 19 వేల రూపాయల నుంచి 75 వేల రూపాయల వరకు ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి కోసం కోట్లు ఖర్చు చేస్తుందనే చెప్పాలి. ప్రజెంట్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి సంబంధించిన ఈ హోటల్ డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news