Moviesహమ్మయ్య..ఫైనల్లీ పూజ హెగ్డే కు ఆఫర్ ఇచ్చిన తెలుగు హీరో..ఆ లక్కి...

హమ్మయ్య..ఫైనల్లీ పూజ హెగ్డే కు ఆఫర్ ఇచ్చిన తెలుగు హీరో..ఆ లక్కి ఫెలో ఎవరంటే..?

పూజ హెగ్డే .. టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . సినిమా ఇండస్ట్రీని తన అందచందాలతో ఏలేసింది . మహేష్ బాబు – బన్నీ – ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. కాగా ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమెను దూరం పెట్టేశారు జనాలు . డైరెక్టర్లు ఆమెను పట్టించుకోవడమే మానేశారు .

ఈ క్రమంలోనే ఆమెకు ఐరన్ లెగ్ అంటూ మరొకసారి ట్యాగ్ చేశారు . రీసెంట్ గా పూజా హెగ్డే ఖాతాలో ఒక తెలుగు ఆఫర్ పడినట్లు తెలుస్తుంది . అది చిన్న ఆఫర్ అయినప్పటికీ పూజకు మంచిగా హిట్ పడుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో ఒక సినిమా తెరకెక్కబోతుంది అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే సెలక్ట్ చేసుకున్నారట మేకర్స్ . గతంలో ఓ హిందీ సినిమాలో పూజా హెగ్డే కు బ్రదర్ గా నటించాడు వెంకటేష్. మరి ఇప్పుడు పూజా హెగ్డే తో రొమాన్స్ చేయడానికి సిద్ధపడుతూ ఉండడంతో ఈ కాంబోపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి . అసలు ఇలాంటి కాంబోని జనాలు ఎక్స్ పెక్ట్ చేయలేకపోయారు. చూద్దాం మరి కాంబో పూజకు ఎంతవరకు సక్సెస్ ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news