Movies"గుంటూరు కారం" సక్సెస్ సెలబ్రేషన్స్ కి త్రివిక్రమ్-ధమన్ అందుకే రాలేదా..? ఈ...

“గుంటూరు కారం” సక్సెస్ సెలబ్రేషన్స్ కి త్రివిక్రమ్-ధమన్ అందుకే రాలేదా..? ఈ కొత్త తలనొప్పి ఏంట్రా బాబు..!

“గుంటూరు కారం”..ఈ మధ్యకాలంలో ఈ సినిమాకి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అయ్యాయో మనం చూసాం . మరీ ముఖ్యంగా సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కానీ సినిమా 150 కోట్లు దాటేసింది అంటూ మూవీ టీం అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు గుంటూరు కారం టీం.

అయితే గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ కి మొత్తం గుంటూరు కారం టీం హాజరైతే బాగుంటుంది అని అంతా అనుకున్నారు . కానీ మెయిన్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ ఫంక్షన్ కి హాజరు కాకపోవడం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతుంది . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఈ ట్రోలింగ్ భరించలేక ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కి రాలేదు అన్న ఫేక్ వార్తలు ఎక్కువగా వైరల్ అయ్యాయి .

అయితే త్రివిక్రమ్ సంక్రాంతి కానుకగా తన సొంత ఊరు వెళ్లారని ..ఆ కారణంగానే సక్సెస్ సెలబ్రేషన్స్ కి రాలేకపోయారు అని తెలుస్తుంది . తమన్ కూడా వేరే సినిమాల పనిమీద చెన్నైలో బిజీగా ఉన్నారట . ఆ కారణంగానే అటెండ్ అవ్వలేకపోయారట . అయితే సోషల్ మీడియాలో మాత్రం కొంతమంది పని పాట లేని వాళ్ళు ఈ న్యూస్ ని బాగా రాద్ధాంతం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news