Moviesపుష్ప2 సినిమాలో ఆ స్టార్ హీరో గెస్ట్ అపీరియన్స్.. సుకుమార్ మైండ్...

పుష్ప2 సినిమాలో ఆ స్టార్ హీరో గెస్ట్ అపీరియన్స్.. సుకుమార్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్ కెవ్వు కేక..!!

వామ్మో.. ఏంటిది ..నిజంగా ఇది నిజమైతే మాత్రం బాక్స్ ఆఫీస్ చరిత్ర తిరగరాయాల్సిందే. రికార్డులు బద్దలు అవ్వాల్సిందే . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోలు ఎంత జోవియల్ గా ఫ్రెండ్లీగా ముందుకు వెళ్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇప్పుడు అందరి కళ్ళు పుష్ప 2 సినిమా పైనే పడ్డాయి . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి బన్నీ బాగా తాపత్రయ పడుతున్నాడు .

పుష్ప1 తో ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకున్న బన్నీ పుష్ప2తో ఏకంగా మరో ఆస్కార్ అవార్డును తీసుకురాబోతున్నాడు అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే పుష్ప2 సినిమాలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది . పుష్ప 2 సినిమాలో ప్రభాస్ నటించబోతున్నాడట . కానీ ఆయన డైరెక్ట్ గా నటించడం లేదు. సలార్ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ ను పుష్ప2లో వాడుకోబోతున్నారట.

పుష్ప రాజ్ ..ప్రభాస్ సలార్ డైలాగులను బేస్ చేసుకుని ఈ సినిమాలో పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారట . సినిమాకి ఈ సీన్స్ హైలైట్ గా మారిపోతున్నాయట .ప్రజెంట్ ఇదే న్యూస్ అవుతుంది. మొత్తానికి పుష్ప 2 సినిమాని సుకుమార్ వెరీ ఇంట్రెస్ట్ గా ప్లాన్ చేశాడు. పైగా ఈ పుష్ప సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప 2లో పరిచయం కానున్నాయి. అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news