Movies"గుంటూరు కారం-హనుమాన్-సైంధవ్-నా సామీ రంగా"..బాలయ్య ఏ సినిమాకి సపోర్ట్ చేస్తున్నాడో తెలుసా..?

“గుంటూరు కారం-హనుమాన్-సైంధవ్-నా సామీ రంగా”..బాలయ్య ఏ సినిమాకి సపోర్ట్ చేస్తున్నాడో తెలుసా..?

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి ఫైట్ టఫ్ గా నెలకొంది . మహేష్ బాబు – తేజ సజ్జ – విక్టరీ వెంకటేష్ – అక్కినేని నాగార్జున నటించిన సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కాగా ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి .ఇప్పటికే చాలామంది స్టార్ హీరోస్ తమ ఫేవరెట్ సినిమాలకు సంబంధించి ప్రమోషన్ స్టార్ట్ చేశారు .

చాలామంది గుంటూరు కారం సినిమాకి సపోర్ట్ చేస్తుంటే చాలా తక్కువ మంది మాత్రమే హనుమాన్ సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక పక్కపక్క రోజుల్లో రిలీజ్ అవుతున్న అక్కినేని నాగార్జున – వెంకటేష్ సినిమాలకు సైతం అదే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉండే బాలకృష్ణ ఈ నలుగురు హీరోలలో ఏ హీరో సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు అన్న విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. కాగ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం నందమూరి బాలకృష్ణ నాలుగు సినిమాలకు సరి సమానంగా సపోర్ట్ చేస్తున్నారు.

కానీ తేజ సినిమాకు మంచి టాక్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారట. హనుమాన్ సినిమా చాలా కష్టపడి తెరకెక్కించడం ఇందుకు ప్రధాన కారణం . మిగతా సినిమాలంతా ఫ్యామిలీ సెంటిమెంట్ లవ్ డ్రామా ఇదే విధంగా ఉంటుంది. కానీ ఒక దేవుడి కాన్సెప్ట్ తో అది కూడా యంగ్ హీరో ఇంతమంది పెద్ద హీరోలను తట్టుకొని ఆ కాంపిటీషన్ ని ఫేస్ చేస్తున్నాడు అంటే కచ్చితంగా గట్స్ ఉన్న హీరో అని ఖచ్చితంగా హనుమాన్ సినిమా మంచి సక్సెస్ అందుకుంటుంది అంటూ బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news