Moviesవామ్మో.. A to Z కన్నడ తెలివితేటలు చూపిస్తున్న రష్మిక మందన్న.....

వామ్మో.. A to Z కన్నడ తెలివితేటలు చూపిస్తున్న రష్మిక మందన్న.. ఇంటర్వ్యూలో ఏం మాట్లాడిందో చూడండి(వీడియో)..!!

రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . పలు సినిమాలలో నటించి సినీ జనాలను ఆకట్టుకుంది . రీసెంట్ గా ఆమె నటించిన యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. బోల్డ్ గా కనిపించిన సరే రష్మిక పర్ఫామెన్స్ కి జనాలు ఫిదా అయిపోయారు. కొంతమంది బూతులు తిడితే మరి కొంతమంది సూపర్ అంటూ పొగిడేసారు.

నెగిటివ్ కామెంట్స్ ని పెద్దగా పట్టించుకోని రష్మిక పాజిటివ్ కామెంట్స్ తో దూసుకుపోతుంది. రష్మిక మందన్నా.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ సౌందర్య గారి బయోపిక్ లో నటించాలని ఉంది అని చెప్పిన కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి . గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”నేను ఇండస్ట్రీకి రాకముందు మా నాన్నగారు నేను అచ్చం సౌందర్య గారిలానే ఉన్నాను అనేవాళ్ళు.. చాలామంది ఇదే కాంప్లిమెంట్స్ ఇచ్చారు “..

“ఆమె లా నేను ఉన్నాను అని కామెంట్స్ దక్కించుకోవడమే నాకు చాలా చాలా హ్యాపీ .. ఆమె జర్నీ అంటే నాకు చాలా ఇష్టం .. కచ్చితంగా ఆమె బయోపిక్ లో నటించే ఛాన్స్ వస్తే నటిస్తాను” అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చింది . దీంతో రష్మిక మందన అతి తెలివితేటలు చూపిస్తుంది అని .. పరోక్షకంగా ఎవరైనా అలాంటి కథను తీసుకోరండి నేను చేస్తాను “అంటూ హింట్ ఇస్తుందని జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ప్రజెంట్ రష్మిక మందన్నా తెలుగులో మూడు బాలీవుడ్ లో నాలుగు సినిమాలతో బిజీగా ముందుకు వెళుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news