Moviesమెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు.. క్రేజీ కపుల్ మిస్సింగ్..!!

మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు.. క్రేజీ కపుల్ మిస్సింగ్..!!

మనకు తెలిసిందే .. మెగా ఫ్యామిలీ ఎక్కడ ఉన్నా సరే అన్ని పండుగలను ఒక్కచోట కలిసి సెలెబ్రేట్ చేసుకుంటుంది . చిన్న పండగ అయినా సరే మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట వాలిపోతుంది . వంటకాలతో స్పెషల్ డ్రెస్ కోడ్లతో అల్లర్లతో చాలా సందడి సందడిగా గడుపుతూ ఉంటుంది మెగా ఫ్యామిలీ . అలాంటి మెగా ఫ్యామిలీ సంక్రాంతి సందర్భంగా బెంగళూరులోని తమ ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు .

చాలా ప్రశాంతంగా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఒక్కచోట పండగ చేసుకున్న పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . అయితే సంక్రాంతి కానుకగా మెగా ఫ్యామిలీ అంతా గ్రూప్ ఫోటో దిగింది. ఆ గ్రూప్ ఫోటోను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు . ఇందులో అబ్బాయిలు అందరూ ట్రెడిషనల్ గా కొత్త పంచలు కట్టుకొని ఉంటే ..

అమ్మాయిలు అందరూ రెడ్ కలర్ ధీమ్ తో మెరిసిపోయారు. చూడడానికి చాలా చక్కగా ఆహ్లాదకరంగా అనిపించింది . అయితే ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ అన్నాలెజీనావో లేకపోవడం కూసింత వెలితిగా అనిపించింది . దీనితో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ ఫోటో పై పలువురు పాజిటివ్గా స్పందిస్తుంటే మరి కొందరు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news