Moviesబాల‌య్య - బాబి సినిమా రిలీజ్ డేట్‌... నంద‌మూరి ఫ్యాన్స్‌కు అప్పుడే...

బాల‌య్య – బాబి సినిమా రిలీజ్ డేట్‌… నంద‌మూరి ఫ్యాన్స్‌కు అప్పుడే గూస్‌బంప్స్ మోత‌

అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ విజ‌యాలు సొంతం చేసుకున్నాడు బాల‌య్య‌. ప్ర‌స్తుతం బాబి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా న‌డుస్తోంది. మొన్న సంక్రాంతికే ఈ సినిమా టైటిల్ ప్ర‌క‌టిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే నంద‌మూరి అభిమానుల‌కు నిరాశే మిగిలింది.

ఈ సినిమాలోనూ బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ట‌. బాల‌య్య ఆరు ప‌దుల వ‌య‌స్సులోనూ రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతుండ‌డంతో స‌హ‌జంగానే బాల‌య్య అభిమానుల‌తో పాటు అంద‌రిలోనూ ఆస‌క్తిగా ఉంది. అస‌లే బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేశాడంటే చాలు ఆ సినిమా సూప‌ర్ హిట్టే. మొద‌టి పాత్ర రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ జాన‌ర్‌లోనూ, రెండో పాత్ర చాలా కొత్త‌గా, పొలిటిక‌ల్ నేప‌థ్యంలో ఉంటుద‌ట‌.

సినిమాలో సెకండాఫ్‌లో అదిరిపోయే పొలిటిక‌ల్ ట్విస్టులు ఉంటాయ‌ట‌. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి బ‌య‌ట‌కు వ‌చ్చిన న్యూస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. స్పీడ్‌గా షూటింగ్ పూర్తి చేసి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందే రిలీజ్ చేయాల‌ని ప్లానింగ్ న‌డుస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు వ‌స్తే అది పార్టీకి కూడా హెల్ఫ్ అవుతుంద‌ని బాల‌య్య లెక్క‌లు వేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

మొన్న ద‌స‌రాకు భ‌గ‌వంత్ కేస‌రితో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బాల‌య్య ఇప్పుడు ఆరు నెల‌ల లోపులోనే మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు అంటే నంద‌మూరి అభిమానుల‌కు ముందే గూస్‌బంప్స్ రావ‌డం ప‌క్కా. చిరంజీవితో వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news