Newsమీ ఫేవ‌రెట్ హీరో ఎవ‌రు... కాజ‌ల్ ఆన్స‌ర్‌తో తార‌క్ ఫ్యాన్స్ ఫ్యీజులు...

మీ ఫేవ‌రెట్ హీరో ఎవ‌రు… కాజ‌ల్ ఆన్స‌ర్‌తో తార‌క్ ఫ్యాన్స్ ఫ్యీజులు ఎగిరాయ్‌… గోల‌గోల‌…!

సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రముఖంగా ఉంటారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ఏకంగా ఆస్కార్ రేంజ్‌కు వెళ్ళిపోయింది. అలాగే కోలీవుడ్ సినిమా నుంచి ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ కూడా తిరుగలేని స్టార్ హీరోగా ఉంటారు. బాక్సాఫీష్‌ పొటెన్షియల్ పరంగా సోషల్ మీడియాలో రికార్డులు, ఇటు లక్షల్లో అభిమానులు ఇవన్నీ టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు, కోలీవుడ్‌లో విజయ్‌కు సొంతం.

ఈ ఇద్దరు హీరోలతో ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోయిన్లు పనిచేశారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. ఈ ఇద్దరితో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా నటించారు. ఎన్టీఆర్‌కు.. కాజల్ బాగా కలిసి వచ్చిన హీరోయిన్. ఎన్టీఆర్ – కాజల్ కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా కాజల్ ఈ ఇద్దరు హీరోలపై చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో చిన్న ఇంట్రాక్షన్లు కాజల్‌కు ఇప్పటి వరకు మీ కోయాక్టర్స్‌లో మీ ఫేవరెట్ హీరో ఎవరు ? అన్న ప్రశ్న ఎదురైంది.

ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయటం చాలా కష్టం అంటూనే తన ఫేవరెట్ కోలీవుడ్‌లో దళపతి విజయ్, టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కాజాలను ఆకాశానికి ఎతేస్తు సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు. కాజల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాజల్ – ఎన్టీఆర్ సినిమాలో ఉంటే ఆ బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news