Moviesఉప్ప‌ల‌పాటి ప్ర‌భాస్ రాజు.. ఎవ‌డూ ట‌చ్ చేయ‌ని రికార్డుల రారాజు..!

ఉప్ప‌ల‌పాటి ప్ర‌భాస్ రాజు.. ఎవ‌డూ ట‌చ్ చేయ‌ని రికార్డుల రారాజు..!

ఎస్ టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ఉప్ప‌ల‌పాటి ప్రభాస్ రాజు నిజంగానే ఇప్పుడు ఎవ్వ‌డూ ట‌చ్ చేయ‌ని రికార్డుల రారాజు. తాజాగా ప్ర‌భాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన స‌లార్ ఈ నెల 22న బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డైనోసార్‌గా గ‌ర్జించింది. సినిమాకు మిడ్ నైట్ షోల‌కే సూప‌ర్ హిట్ టాక్ రావ‌డంతో కేవ‌లం ఐదు రోజుల్లోనే ఏకంగా రు. 500 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టేసింది. ఇదిలా ఉంటే స‌లార్ సినిమా తెలుగు హీరోల‌లో ఏ హీరోకు లేని అరుదైన రేర్ రికార్డ్ ప్ర‌భాస్ ఖాతాలో వేసింది.

నార్త్ ఇండియాలో రు. 100 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ట్ చేసిన హీరోల జాబితాలో ప్ర‌భాస్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. సౌత్ ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్ మాత్ర‌మే రు. 100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించారు. ప్ర‌భాస్ మాత్రం బాహుబలి 1, బాహుబలి 2, సాహో, ఆదిపురుష్ సినిమాలతో ఇప్పటికే నాలుగు సార్లు వంద కోట్లకి పైగా కలెక్షన్స్ నార్త్ ఇండియాలో అందుకోగా.. ఇప్పుడు స‌లార్ సినిమాతో ఐదో సారి ఈ రేర్ ఫీట్ సాధించాడు.

ఈ ఫీట్ సాధించేందుకు ప్ర‌భాస్‌కు ఐదేళ్లు ప‌ట్టింది. ఇక మిగిలిన హీరోలు ఈ ఫీట్ అందుకోవాలంటే 10 – 15 ఏళ్ల‌లో అయినా అందుకుంటారా ? అన్న సందేహాలు క‌ల‌గ‌క మాన‌వు. ఇక క‌ల్కి మూవీ కూడా హిట్ అయితే ప్ర‌భాస్‌కు పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్ వ‌చ్చేస్తుంది. అత‌డి మార్కెట్ అప్పుడు రు. 1000 కోట్ల‌కు పైనే ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news