Moviesఎన్టీఆర్ ' టెంప‌ర్‌ ' కు.. ప్ర‌భాస్ స్పిరిట్‌కు లింక్ ఉందా...!

ఎన్టీఆర్ ‘ టెంప‌ర్‌ ‘ కు.. ప్ర‌భాస్ స్పిరిట్‌కు లింక్ ఉందా…!

యానిమల్ సినిమాతో దేశం మొత్తాన్ని తనవైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాతోనే తన వైబ్రేషన్ ఏంటో పరిచయం చేసిన సందీప్ రెడ్డి.. యానిమల్ సినిమాలో ఏకంగా విశ్వరూపం చూపించారు. ఈ సినిమా బాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసింది. ఇప్పటివరకు రణబీర్ కపూర్ లో పరిచయం కానీ యాక్టర్ ని యానిమల్ సినిమా ద్వారా సందీప్ రెడ్డి పరిచయం చేశారు.

ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయ నాయకుల సైతం యానిమల్ సినిమా గురించి చర్చించుకునేలా చేశాడు. ఒక సినిమా చేసిన తర్వాత సహజంగానే ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఉంటాయి. యానిమల్ సినిమా విషయంలో కూడా సందీప్ పై విమర్శలు, ప్రశంసలు వచ్చాయి. అయితే అంతకుమించి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఆడియన్స్ ఇచ్చారు. సందీప్ రెడ్డి సినిమా అంటేనే హీరో పాత్రలో విపరీతమైన కోపాన్నిచూపిస్తాడు.

ఈ కోపాన్ని సినీ అభిమానులు అంగీకరించడం వల్ల సందీప్ రెడ్డి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక నెక్ట్స్‌ ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా సందీప్ చేయబోతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా పనులు కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని.. స్పిరిట్ ద్వారా మొదటిసారి కెరీర్‌లో కాప్ రోల్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ గతంలో రాఘవేంద్ర సినిమాలో కోపం ఎక్కువగా ఉన్న క్యారెక్టర్ లో నటించాడు.

మంచి క్యారెక్టర్ అయినా కూడా ఆ సినిమా అప్పట్లో వర్క్ అవుట్ కాలేదు. తర్వాత చేసిన సినిమాలు అన్నీ మల్టిపుల్ ఎమోషన్స్ తో ఉన్నాయి. అయితే మళ్లీ ఇన్నేళ్లకు స్పిరిట్ మూవీలో చాలా కోపిష్టి పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో చేసిన పోలీస్ పాత్రకు దగ్గర దగ్గర లింకులు ఉంటాయని తెలుస్తోంది. ఓ సీక్రెట్ ఆపరేషన్ నేపథ్యంలో ప్రభాస్ విలన్లతో కలిసిపోయి ఏం చేశాడు ? అన్నదే ఈ సినిమా మెయిన్ లైన్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news