Newsఅల్లు అర్జున్ - నయనతార కాంబోలో మిస్ అయిన సూపర్ డూపర్...

అల్లు అర్జున్ – నయనతార కాంబోలో మిస్ అయిన సూపర్ డూపర్ హిట్ సినిమా ఇదే.. ఆ ప్లేస్ ని దక్కించుకున్న లక్కి బ్యూటీ ఈమే..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు సెట్ అయినట్టే సెట్ అయి లాస్ట్ మూమెంట్లో మిస్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆ కాంబోలో సెట్ అవ్వడం చాలా చాలా టఫ్ . కొన్నిసార్లు అసలు ఆ కాంబో సెట్ కాకపోవచ్చు . ఆ లిస్టులోకే వస్తారు అల్లు అర్జున్ – నయనతార. అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకొని ముందుకు వెళుతున్నాడు . నయనతార సౌత్ ఇండస్ట్రీలోని క్రేజీ బ్యూటీ గా పేరు సంపాదించుకుంది .

అయితే అల్లు అర్జున్ – నయనతార కాంబినేషన్లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. నిజానికి వీళ్ళిద్దరి కాంబోలో ఓ సినిమా రావాల్సింది . అదే ” దువ్వాడ జగన్నాధం”. హరిష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది . అయితే పూజ హెగ్డే స్థానంలో ముందుగా హరీష్ శంకర్ నయనతారను అనుకున్నారట . కానీ ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడంతో పాటు సినీ ప్రమోషన్స్ కి రాను అంటూ తెగేసి చెప్పిందట .

దీంతో నయనతార హెడ్ వెయిట్ దించేయాలి అంటూ అల్లు అర్జున్ ఈ సినిమా నుండి ఆమెను అవుట్ చేశాడు . అలా వీళ్ళిద్దరూ కాంబోలో రావాల్సిన సినిమా మిస్సయింది. ఏ ముహూర్తాన సినిమా మిస్సయిందో కానీ అప్పటినుంచి ఇప్పటివరకు వీళ్ళ కాంబోలో సినిమా సెట్ అవ్వనేలేదు. ఇకపై సెట్ అవుతుంది అన్న ఆలోచనలు కూడా లేవు. ప్రజెంట్ పుష్ప 2 సినిమా షూట్ బిజీ గా ఉన్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news