Moviesఅబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..పెళ్లి గురించి క్రేజీ న్యూస్ చెప్పిన ఛార్మీ.. ఆ హ్యాండ్సమ్...

అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..పెళ్లి గురించి క్రేజీ న్యూస్ చెప్పిన ఛార్మీ.. ఆ హ్యాండ్సమ్ హీరోతో నేనా..?

ఛార్మి .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ప్రెసెంట్ ఈ పేరుకి పాపులారిటీ లేదు . కానీ ఒకప్పుడు ఈ పేరు చెప్తే మాత్రం కుర్రాళ్ళు గిలగిలా కొట్టుకునేవారు . అప్పట్లో స్టార్ హీరోలు కూడా ఛార్మి డేట్స్ కోసం క్యూ కట్టుకొని మరి వెయిట్ చేశారు .. అంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాగార్జున -వెంకటేష్ అందరూ కూడా ఛార్మితో సినిమాలో నటించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు .

అంతేకాదు నాగార్జున నటించిన మాస్ సినిమా ఆయన కెరీర్ కు ఎంత ప్లస్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఆయన కంటే ఛార్మినే ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ దక్కించుకున్నింది. కేవలం సీనియర్ హీరోస్ తోనే కాదు యంగ్ హీరో సినిమాలో కూడా నటించి మెప్పించింది . ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ప్రొడక్షన్ సైడ్ ఉన్న ఛార్మి.. పూరి జగన్నాథ్ తో రిలేషన్ షిప్ లో ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది .

అయితే దీనిపై ఇద్దరూ కూడా స్పందించలేదు . అంతకుముందు సింగర్ దేవి శ్రీ ప్రసాద్ తో ప్రేమాయణం నడిపింది అంటూ వార్తలు వినిపించాయి . పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా టాక్ వినిపించింది . కానీ అది అక్కడితోనే ఆగిపోయింది . అయితే రీసెంట్గా ఛార్మి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నపై స్పందించింది . ఆ హీరో ఒప్పుకుంటే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ షాక్ ఇచ్చింది ఛార్మి. ఆయన మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ . ఆల్ రెడీ ఆయనకి పెళ్లి అయిపోయింది . డివర్స్ కూడా అయిపోయింది . ఆ హీరో పై మోజు పడుతుంది ఛార్మి . అతగాడు ఒప్పుకుంటే పెళ్లికి రెడీ.. రేపే పెళ్లి చేసుకుంటా అంటూ నాటీ కామెంట్స్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news