Movies"సలార్ హిట్ అయితే గుండు కొట్టించుకుంటా"?.. ప్రభాస్ కోసం తెలుగు...

“సలార్ హిట్ అయితే గుండు కొట్టించుకుంటా”?.. ప్రభాస్ కోసం తెలుగు హీరో సంచలన నిర్ణయం.. ఇదే కదా రియల్ అభిమానం అంటే..!

వామ్మో.. ఏంటిది నిజంగా .. ఆ హీరో అంతటి నిర్ణయం తీసుకున్నాడా..? ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకు పిచ్చెక్కించే న్యూసే . ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సలార్ ఫీవర్ పట్టుకుంది . చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ థియేటర్స్ లో ఓ బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడానికి రెడీ అయిపోతున్నాడు ప్రభాస్. ఆరడుగుల అందగాడు ప్రభాస్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా ..మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కే జి ఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఒక్కొక్క న్యూస్ వింటుంటేనే గూస్ బంప్స్ తెప్పించేస్తున్నాయి. థియేటర్స్ వద్ద ప్రభాస్ అభిమానుల సందడి నెలకొంది . ఇప్పటినుంచే థియేటర్ వద్ద ఎంత హంగామా చేయాలి అంటూ పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు రెబల్ ఫ్యాన్స్ . ఇలాంటి క్రమంలోనే ఆయన ఫ్యాన్స్ అయిన హీరోలు ప్రభాస్ అభిమానులకు ఫ్రీగా టికెట్లను బుక్ చేసి ఇస్తున్నారు.

అయితే ప్రభాస్ జాన్ జిగిడి దోస్త్ అయిన గోపీచంద్ ఏకంగా భారీ స్థాయిలోనే మొక్కేశాడు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . ప్రభాస్ ఈ సినిమాతో హిట్ కొడితే తిరుమల శ్రీవారికి నడుచుకుంటూ వెళ్లి గుండు కొట్టించుకుంటాను అంటూ గోపీచంద్ మొక్కుకున్నారట. ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఎవరు చెప్పారు ..? ఎక్కడ నుంచి లీక్ అయ్యిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త వెరీ వెరీ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. మరి చూడాలి ఇది నిజంగానే గోపీచంద్ చెప్పారా..? లేకపోతే ఫాన్స్ పుట్టించిన పుకారా అన్నది..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news