Moviesప్రభాస్ నే కాల్ చేసి అడిగిన "సలార్" సినిమాలో హీరోయిన్...

ప్రభాస్ నే కాల్ చేసి అడిగిన “సలార్” సినిమాలో హీరోయిన్ గా చేయను అంటూ చెప్పిన బ్యూటి ఈమె.. దరిద్రం నెత్తిమీద ఉంటే ఇంతే..!!

సలార్.. ప్రెసెంట్ ఎక్కడ చూసినా సరే ఈ పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . గత కొన్ని సంవత్సరాలుగా హిట్ లేకుండా అల్లాడిపోయిన ప్రభాస్ ఈ సినిమాతో హిట్ కొడతాడా..? లేక ఫ్లాప్ కొట్టి హ్యాట్రిక్ ఫ్లాప్స్ దాటేసిన హీరోగా చెత్త రికార్డును క్రియేట్ చేసుకుంటాడా..? అంటూ ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడ్డారు. అయితే ఫైనల్లీ ప్రశాంత్ నీల్ గట్టు ఎక్కించేశాడు . ఎప్పటినుంచో ప్రభాస్ వెయిట్ చేస్తున్న బిగ్ బ్లాక్ బస్టర్ ఖాతాలో పడేలా చేశాడు .

బాహుబలి తర్వాత అలాంటి రేంజ్ హిట్ అందుకున్న సినిమాగా సలార్ రికార్డులు క్రియేట్ చేసింది . కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది . ఎలా అంటే థియేటర్స్ నుంచి ఫ్యాన్స్ బయటకు వస్తుంటే అరుపులు కేకలతో విజిల్స్ తో మారుమ్రోగించేశాడు. ఒక్కొక్క సీన్ లో ప్రభాస్ ఎలివేషన్స్ పృథ్విరాజ్ తో వచ్చే డైలాగ్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం రొమాంటిక్ , కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలే కాదు ఇలా సెంటిమెంట్ సినిమాల్లో కూడా ప్రభాస్ నటించి మెప్పించగలరు అంటూ ప్రూవ్ చేసాడు ప్రశాంత్ నీల్.

ఒక్క మాటలో చెప్పాలంటే ప్రశాంత్ నిల్ ఈ సినిమా ద్వారా కేజిఎఫ్ కి మించిన హిట్టే అందుకున్నాడు అని చెప్పాలి . ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. అయితే ముందుగా ప్రశాంత్ నీల్ ఈరోల్ కోసం బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ను అప్రోచ్ అయ్యారట . అయితే వరుసగా ప్రభాస్ ఫ్లాప్స్ కొడుతూ ఉండటంతో ఎక్కడ సలార్ కూడా దెబ్బతింటుందో అన్న భయంతో అమ్మడు రిజెక్ట్ చేసిందట . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు ఆమెను ఈ సినిమాలో చేయమంటూ బలవంతం చేశారట . కానీ ఆమె అంగీకరించకపోవడంతో ఈ ఆఫర్ శృతిహాసన్ కి వెళ్ళింది ..మంచి హిట్ తన ఖాతాలో వేసుకునింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news