Movies"ఆ తెలుగు హీరోతో నటించాలంటే నరకం".. పేరుతో సహా ఓపెన్ గా...

“ఆ తెలుగు హీరోతో నటించాలంటే నరకం”.. పేరుతో సహా ఓపెన్ గా చెప్పేసిన కాజల్ అగర్వాల్..!!

ఎస్ ప్రెసెంట్ కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవితో నటించాలి అని ఆయనతో డాన్స్ చేయాలని ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి హీరోయిన్ కి ఉంటుంది . అందుకే సంబంధం లేకుండా చాలా చిన్న ఏజ్ లోనే ఆయనతో నటించడానికి ముందుకు వస్తూ ఉంటారు బడా హీరోయిన్స్.

కాజల్ కూడా అలాగే ఖైదీ నెంబర్ 150 సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంది . ఆడి పాడి అలరించింది. ఆ తర్వాత ఆచార్యతో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సింది . సగం సినిమా పూర్తి అయిన తర్వాత ఆమె సినిమా నుంచి తీసేసారు. రీజన్స్ ఏంటో వాళ్లకే తెలియదు కానీ..రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న చందమామ చిరంజీవి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

“నేను ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలతో నటించాను .. డాన్స్ కూడా చేశాను కానీ చిరంజీవితో డాన్స్ అంటే కాస్త భయం ..ఎలాంటి షాట్ అయినా సరే సింగిల్ టేక్ లోనే పూర్తి చేసేస్తారు ..ఆయనకు సరి సమానంగా చేయాలని కాదు కానీ కనీసం ఆయనకి దరిదాపుల్లోనే ఉండాలని నేను చాలా ప్రయత్నిస్తాను ..కానీ ఏడూ ఎనిమిది టేకులు తీసుకునే వరకు నాకు సెట్ అవ్వదు. అందుకే ఆయనతో డాన్స్ చేయాలంటే నాకు చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది . ఒక్కొక్కసారి ఆ భయంతో నరకాన్ని అనుభవించేదాన్ని” అంటూ చెప్పుకొచ్చింది. ప్రెసెంట్ ఇదే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news