Moviesసందీప్ రెడ్డి వంగా డైరెక్టర్ అవ్వడానికి కారణం నాని సినిమాలోని ఆ...

సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్ అవ్వడానికి కారణం నాని సినిమాలోని ఆ సీన్ నేనా..? ఇన్నాళ్ళకు బయటపడిన అసలు నిజం..!!

సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే మారు మ్రోగి పోతుంది . మరీ ముఖ్యంగా యానిమల్ సినిమా తెరకెక్కించిన తర్వాత సందీప్ రెడ్డివంగా పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అర్జున్ రెడ్డి మూవీ రిలీజ్ అయ్యాక ఆయన పేరు ఎంత మారుమ్రోగిపోయిందో అందుకు వందరెట్లు ఎక్కువగా ఇప్పుడు ఆయన పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. యానిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది.

ఈ క్రమంలోనే ఆయన బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతున్నాయి . నిజానికి సందీప్ రెడ్డి వంగ పేరు అర్జున్ రెడ్డి సినిమా కంటే ముందు అసలు ఎవరికీ తెలియదు. ఆయన అనేవాడు అసలు ఉన్నాడు ..? అంటూ కూడా జనాలు మర్చిపోయారు . అయితే అర్జున్ రెడ్డి తో ఓవర్ నైట్ గా స్టార్ట్ డైరెక్టర్ లిస్టులోకి ఆడ్ అయిపోయారు సందీప్ రెడ్డి వంగా. ఈయనది మెడికో బ్యాక్ గ్రౌండ్ అంటూ తెలుస్తుంది.

డైరెక్షన్ పై ఉన్న ఆసక్తితో ఆయన ఈ వృత్తిని చూస్ చేసుకున్నారట . ఫిలిమ్స్ స్కూల్లో డైరెక్షన్ కూడా నేర్చుకున్నారట . మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా వచ్చారు. 2011 టైం లో రైడ్ అనే సినిమా రిలీజ్ అయింది . అందులో నాని బైక్ నడిపే సీన్ చూసి ఫీదా అయ్యాడట సందీప్ . దీంతో ఎలాగైనా నానితో సినిమా తీయాలి అని ఫిక్స్ అయ్యాడట .

కానీ ఎవరిని కలవాలో తెలియదు ..ఎలా ప్రొసీజర్ ముందుకు తీసుకెళ్లలో తెలియక టైం వేస్ట్ చేశారట . ఆ టైంలోనే డిప్రెషన్ తో సందీప్ రెడ్డివంగా మోకాకి వచ్చి కూర్చున్నారట . ఆ సమయంలో అక్కడే నాని కొంతమంది ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతూ ఉన్నారట . ఆ టైంలో ఓ వ్యక్తి వచ్చి గన్ టేబుల్ మీద పెట్టి టీ తాగుతున్నాడు . ఎంత ట్రై చేసినా నాని ఐస్ ని బ్రేక్ చేయలేకపోతున్నారట .

చాలాసేపు ఉన్నది వర్కౌట్ కాలేదట . మధ్యలో వెళ్లి కలుద్దామా అంటే విసుక్కుంటే తట్టుకోలేమని వెళ్ళిపోయాడట . ఆ తర్వాత ఆ కథను పక్కన పెట్టేసాడట . ఆ సమయంలో నాని చేసే సినిమాలు చూసి ఆయన గ్రోత్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాడట . కానీ ఆయనతో సినిమా చేయలేకపోయాను అంటూ బాధ పడ్డారట . నాని సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రావాల్సిన మొదటి సినిమా మిస్ అయింది .

నాని హీరోగా సందీప్ రెడ్డివంగా సినిమా చేసి ఉంటే మాత్రం నాని కెరియర్ ఇప్పుడు ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాలా ..? ఈ విషయాన్ని ఇటీవల నానితో చేసిన చిట్ చాట్ లో చెప్పుకొచ్చారు సందీప్ రెడ్డివంగా . అంతే కాదు యం డైరెక్టర్స్ కి ఓ సజెషన్ కూడా ఇచ్చారు . ఏదైనా మీకు చేయాలనిపిస్తే ఆ పని చేసేయండి అని ..లేకపోతే లైఫ్ లో మళ్ళీ మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news