News"హాయ్ నాన్న VS యానిమల్".. బన్నీకి బాగా నచ్చిన సినిమా ఏంటో...

“హాయ్ నాన్న VS యానిమల్”.. బన్నీకి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా..? ఇంత ఓపెన్ గా చెప్పేశాడు ఏంటి..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు తమ తోటి హీరోల సినిమా రిలీజ్ అయినప్పుడు మంచిగా రివ్యూ ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మహేష్ బాబు – అల్లు అర్జున్ అయితే ప్రతి ఒక్క స్టార్ హీరో సినిమాకు రివ్యూ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. యానిమల్ సినిమాకు హాయ్ నాన్న సినిమాకు అల్లు అర్జున్ తనదైన స్టైల్ లో రివ్యూ ఇచ్చాడు . అయితే అల్లు అర్జున్ రివ్యూ ని బట్టి చూస్తే ఆయనకు యానిమల్ సినిమా బాగా నచ్చేసింది అని ..హాయ్ నాన్న సినిమా కొంచెం యావరేజ్ గా అనిపిస్తుంది అని ఆయన చేసిన ట్వీట్ ఆధారంగా తెలుస్తుంది అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు .

అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా యానిమల్ సినిమాను పొగుడుతూ ఓ రేంజ్ లో ట్విట్ చేశారు . సినిమాలోని ప్రతి ఒక్క నటీనటుల పేర్లు మెన్షన్ చేస్తూ వాళ్ళలోని గుడ్ యాక్టింగ్ స్కిల్స్ ను పొగిడేశారు . రన్బీర్ కపూర్ – సందీప్ రెడ్డి వంగ – తృప్తి – రష్మిక మందన్నా పేర్లను ట్యాగ్ చేసి మరి ఆయన ఓ రేంజ్ లో పొగిడేసారు. అఫ్ కోర్స్ హాయ్ నాన్న సినిమా టైంలో కూడా ఆయనను అలాగే పొగిడేశారు.

నాని – మృణాల్ ఠాకూర్ – బేబీ కియరా మ్యూజిక్ డైరెక్టర్ – డైరెక్టర్ ప్రతి ఒక్కరిని టాగ్ చేస్తూ పొగిడేశారు. కానీ సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా రివ్యూ చెప్పినప్పుడు వాడిన అని ఎక్స్ట్రాడినరీ వర్డ్స్ హాయ్ నాన్న సినిమాకు యూజ్ చేయలేకపోయాడు బన్నీ. ఈ క్రమంలోనే బన్నీ ట్వీట్స్ ను కంపేర్ చేస్తూ ఆయనకు యానిమల్ సినిమానే నచ్చింది అని ఆ తర్వాతే హాయ్ నాన్న అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news