Newsగుంటూరు కారం నుండి "ఓ బేబీ సాంగ్" ప్రోమో వచ్చేసిందిరోయ్..అచ్చు గుద్దిన్నట్లు...

గుంటూరు కారం నుండి “ఓ బేబీ సాంగ్” ప్రోమో వచ్చేసిందిరోయ్..అచ్చు గుద్దిన్నట్లు ఆ సాంగ్ లానే లేదు(Video)..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన ఓ మై బేబీ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసేసారు మేకర్స్. ముందుగానే చెప్పిన విధంగా ఈ పాటను డిసెంబర్ 11వ తేదీ సాయంత్రం రిలీజ్ చేస్తామని అన్నట్లుగా రిలీజ్ చేశారు. తివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే ముందు దానిపై ఎక్కువగా ట్రోలింగే జరుగుతుంది .

అయితే ఈసారి కూడా అదే విధంగా ఓ మై బేబీ అనే సాంగ్ పై హ్యూజ్ రేంజ్ ట్రోలింగ్ జరుగుతుంది . ఈ సినిమాలోని ఈ పాట ప్రోమో రిలీజ్ చేస్తున్నాము అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేయగానే అది అచ్చం దూకుడు సినిమాలోని ఓ పోస్టర్లా ఉంది అంటూ ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. కాగా కొద్దిసేపటి క్రితమే “ఓ మై బేబీ” అంటూ శ్రీ లీల మహేష్ బాబు మధ్య వచ్చే మంచి ఫీల్ గుడ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు .

అయితే ఈ ప్రోమో చూసిన జనాలు ఈ పాట అచ్చం “యూ ఆర్ మై డార్లింగ్” అంటూ సాగే పాటలానే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు మ్యూజిక్ పరంగా బాగానే ఉన్నా ఇది మహేష్ బాబు లాంటి హై రేంజ్ హీరోకి సెట్ అయ్యే విధంగా లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు . చిన్న ప్రోమోకే ఈ విధమైన ట్రోలింగ్ స్టార్ట్ చేస్తే .. పూర్తి పాట రాగానే మరి ఎంత ట్రోలింగ్ జరుగుతుందో..? మొత్తానికి గుంటూరు కారం సినిమా ద్వారా క్రేజీ హిట్ అందుకుందామనుకున్న తమన్ కు ఏదో తేడా కొట్టేలాగే ఉండబోతుంది రిజల్ట్ అంటూ అర్థం అయిపోతుంది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news