Newsమెగా ఫ్యామిలీలో బిగ్ ఫంక్షన్..అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఈసారి పిచ్చెక్కిపోవాల్సిందే..!

మెగా ఫ్యామిలీలో బిగ్ ఫంక్షన్..అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఈసారి పిచ్చెక్కిపోవాల్సిందే..!

మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా లావణ్య – వరుణ్ పెళ్లి జరిగినప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి సంబంధించిన న్యూస్ లు ఎక్కడ కనిపించిన సరే అవి జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతున్నాయి. కాగా నవంబర్ 1న గ్రాండ్గా ఇటలీలో పెళ్లి చేసుకున్న వరుణ్ – లావణ్య జంట ప్రజెంట్ హనీమూన్ ఎంజాయ్ చేస్తుంది.

దాదాపు 7 దేశాలు చుట్టేసి హనీమూన్ ని ఫుల్ ఎంజాయ్ చేయాలని భావిస్తుందట ఈ జంట. అయితే ఇండియా తిరిగి వచ్చాక మాత్రం ఈ జంట ఓ గ్రాండ్ పార్టీ ఇవ్వబోతుందట . కేవలం మెగా కుటుంబ సభ్యులు – అల్లు కుటుంబ సభ్యులు – కామినేని కుటుంబ సభ్యులు మాత్రమే ఎంజాయ్ చేసేలా ఓ పార్టీను హోస్ట్ చేయబోతుందట వరుణ్ లావణ్య జంట .

అయితే వరుణ్ – లావణ్య పెళ్లికి పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య కొడుకు అకీరా అటెండ్ కానీ విషయం తెలిసిందే. ఈ ఫంక్షన్ కి మాత్రం పవన్ కళ్యాణ్ తో పాటు అకిరా ఆధ్యా కూడా అటెండ్ కాబోతున్నారట . పలువురు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఈ పార్టీకి హాజరు కాబోతున్నారట . దీంతో మెగా ఫ్యాన్స్ ఈ న్యూస్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు చాలా రోజుల తరువాత ఆద్యాని అకిరాని పవన్ తో చూడబోతున్నాం అంటూ సంతోషపడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news