Newsక‌ళ్యాణ్ రామ్ " డెవిల్ " గొడ‌వ‌లో మ‌రో దిమ్మ‌తిరిగే ట్విస్ట్‌..!

క‌ళ్యాణ్ రామ్ ” డెవిల్ ” గొడ‌వ‌లో మ‌రో దిమ్మ‌తిరిగే ట్విస్ట్‌..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా డెవిల్. ఈ సినిమాపై గత కొద్ది నెలలుగా ఒక వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళినప్పుడు దర్శకుడుగా నవీన్ మేడారం పేరు ప్రకటించారు. నిర్మాతగా అభిషేక్ నామ ఉన్నారు. టీజర్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాకు నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నట్టు వేశారు. విచిత్రం ఏంటంటే అభిషేక్ నామాకు ఇప్పటివరకు రైటింగ్, డైరెక్షన్ విభాగంలో ఎలాంటి అనుభవం లేదు.. ఆయన కేవలం నిర్మాతగా పలు సక్సెస్‌లు కొట్టారు.

అయితే అలాంటి అభిషేక్ నామా.. ఉన్నట్టుండి ఎలా డైరెక్టర్ అయిపోయాడో సినీ జనాలకు అస్సలు అర్థం కాలేదు. మామూలుగా డైరెక్టర్‌తో.. నిర్మాతకు విభేదాలు వస్తే అతడిని పక్కనపెట్టి మరో డైరెక్టర్‌తో సినిమా పూర్తి చేయడం జరుగుతుంది. అయితే ఏకంగా నిర్మాత, డైరెక్టర్‌గా మారి తన పేరు వేసుకోవటం ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో ఏ మాత్రం భాగస్వామ్యం లేని రైటర్ శ్రీకాంత్ విస్పా పేరు.. ఇప్పుడు డెవిల్ మూవీ కథ, డైలాగ్స్, క్రెడిట్ అని పడింది. ఏది ఏమైనా డెవిల్ రైటింగ్, డైరెక్షన్ విషయంలో కొత్త కొత్త ట్విస్ట్‌లు ఆడియన్స్‌ను బాగా కన్ఫ్యూజన్‌కు గురిచేస్తున్నాయని చెప్పాలి.

అయితే ట్రైలర్ మాత్రం చూస్తే అదిరిపోయింది. ఇది ఒక పర్ఫెక్ట్ ట్రైల్లర్ సినిమాలా అనిపించింది. దర్శకుడు పేరు మారిపోవడంతో డెవిల్ టీం నుంచి ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు. ఈ సినిమాకు ముందు అనుకునే దర్శకుడు నవీన్ మేడారం.. కూడా చాలా సైలెంట్‌గా ఉన్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా కనిపించనున్నాడు. కళ్యాణ్ రామ్‌కు జోడిగా సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. డిసెంబర్ 29 న ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news