Newsఈ స్టార్ క్రికెట‌ర్ల భార్య‌లు, ప్రియురాళ్లు ఏం చేస్తారో తెలుసా...!

ఈ స్టార్ క్రికెట‌ర్ల భార్య‌లు, ప్రియురాళ్లు ఏం చేస్తారో తెలుసా…!

ప్రపంచ కప్ క్రికెట్ 2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే వరుసగా పది మ్యాచ్‌ల‌లో వరుస విజయాలు సాధిస్తూ ఫైనల్‌కు చేరింది. అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌లో టీం ఇండియా ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకొనుంది. ప్రస్తుతం వరల్డ్ కప్ లో స్టార్ క్రికెటర్లు అందరూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అందరూ ప‌రుగుల వ‌ర‌ద‌ పారిస్తున్నారు. ఇక మన ఇండియన్ క్రికెటర్ల బార్యలు, ప్రియురాళ్లు ఎవరు ? వారి వృత్తి ఏంటి అన్నది సహజంగా ఆసక్తిగా ఉంటుంది.

విరాట్ కోహ్లీ – అనుష్క శ‌ర్మ :


విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ బాలీవుడ్ లో ఒకప్పుడు తిరుగులేని క్రేజీ హీరోయిన్. కోహ్లీ సక్సెస్ వెనక అనుష్క సపోర్ట్ ఎంతో ? ఉంటుంది. ఓ యాడ్ షూట్‌లో మొదలైన వీరి పరిచయం ప్రేమకు దారితీసి 2017 లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె నటిగానే కాకుండా ఎంటర్ ప్రెన్యూర్‌గా కొనసాగుతోంది.

రోహిత్‌శ‌ర్మ – రితికా స‌జ్దే :


రోహిత్ శర్మ పేరిట అనేక రికార్డులు ఉన్నాయి. రోహిత్ శర్మలో ఎప్పుడూ ఎనర్జీ నింపుతుంది భార్య రితిక సజ్దే. 2008లో కలుసుకున్న ఈ జంట ఆరు ఏళ్లు డేటింగ్ చేసి 2015లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి. రితిక స్పోర్ట్స్ మేనేజర్‌గా ఉన్నారు.
సూర్య‌కుమార్ – దేవిశెట్టి :


ఇక భారీ ఫ్యాన్ బేస్ కలిగిన యంగ్ క్రికెటర్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకరు. సూర్య కుమార్ యాదవ్ భార్య దేవిశెట్టి డ్యాన్స్ కోచ్ మరియు వ‌లంటీర్. సౌత్ ఇండియా ఫ్యామిలీలో పుట్టిన ముంబై అమ్మాయి. 2012లో వీరికి పరిచయం అయింది.

ఇషాన్ కిష‌న్ – అదితి హుండీ :


మ‌రో యంగ్ క్రేజీ క్రికెట‌ర్ ఇషాన్ కిషన్ లవ్ ఇంట్రెస్ట్ అదితి హుండీలో మోడల్. యమహా ఫ్యాషన్ మిస్ దివా యూనివర్సిటీలో నెగ్గింది. సోషల్ మీడియా వేదికగా ఇషాన్ కిషన్ ని సపోర్ట్ చేస్తూ తన ప్రేమను చాటుకుంటూ ఉంటుంది.
ర‌వీంద్ర జ‌డేజా – రివాబా సోలంకి :


ఆల్ రౌండర్ రవీంద్ర జ‌డేజా భార్య రివాబా సోలంకి. ఈమె వృత్తి రీత్యా మెకానికల్ ఇంజనీర్. 2016లో వీరు వివాహం చేసుకున్నారు. ఇక రివాబా రాజకీయాల్లోకి వచ్చి బిజెపి తరఫున గుజరాత్, జామ్‌న‌గర్ నార్త్ అసెంబ్లీగా ఎన్నికయ్యారు.

హార్దిక్ పాండ్యా – న‌టాషా :


సత్యాగ్రహ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన నటాషా స్టోన్కోవి ప్రేమలో పడ్డాడు హార్దిక్ పాండే. డేటింగ్ లో ఉండగానే నటాషా గర్భం దాల్చడంతో వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక కొడుకు ఉన్నాడు. ఈ సెర్బియ‌న్ నటి ఎంకరేజ్మెంట్ చేస్తుంటే హార్దిక్ గ్రౌండ్‌లో రెచ్చిపోతూ ఉంటాడు.
అతియాశెట్టి – కేఎల్‌. రాహుల్ :


ఇక బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అతియా శెట్టి – కేఎల్ రాహుల్ ప్రేమ గురించి అందరికీ తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news