Newsఆ తెలంగాణ ఎంపీ నానికి పిచ్చ ఫ్యాన్‌... నేచుర‌ల్ స్టార్ ఎందుకంత...

ఆ తెలంగాణ ఎంపీ నానికి పిచ్చ ఫ్యాన్‌… నేచుర‌ల్ స్టార్ ఎందుకంత ఇష్టం అంటే..!

నేచురల్ స్టార్ నాని తన సహజసిద్ధమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సినిమాతో మొదలుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు నాని టాలీవుడ్ లో తిరిగిలేని నేచురల్ స్టార్ అయిపోయాడు. నాని సినిమాలో వస్తున్నాయి అంటే యూత్ తో పాటు మహిళా అభిమానులు, ఫ్యామిలీ అభిమానుల్లో ఎక్కడా లేని అంచనాలు ఉంటున్నాయి. నాని సినిమాల్లో చాలా నాచురాలిటీ కనిపిస్తోంది.

మన ఇంట్లో కుర్రాడు ఎలా ఉంటాడు ? లేదా మన పక్కింటి అబ్బాయి ఎలా ఉంటాడో ? అలాంటి నటన నాని లో కనిపిస్తూ ఉంటుంది. అందుకే చాలా తక్కువ టైంలోనే డిఫరెంట్ హీరోగా టాలీవుడ్ లో సెటిల్ అయిపోయాడు. నానికి సగటు సినీ అభిమానులు మాత్రమే కాదు పొలిటికల్ సెలబ్రిటీలు కూడా పిచ్చ‌ అభిమానులుగా ఉంటూ ఉంటారు. ఈ లిస్టులో చాలామంది ఉన్నారు. తెలంగాణలోని నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా నాని అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పారు.

నాని సినిమాలు అన్నీ తను రెగ్యులర్ గా చూస్తూ ఉంటానని నానిలో సహజసిద్ధమైన నటన తనకు ఎంతో బాగా నచ్చుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తను చిన్నప్పుడు కాలేజీ రోజుల్లో చిరంజీవి సినిమాలు అన్ని చూసేవాడిని అని.. ఇక కాలేజ్ చదువుతున్న రోజుల్లో తన ఫస్ట్ క్రష్ ఎవరు ? అంటే సోనాలి బింద్రే పేరు ధర్మపురి అరవింద్ చెప్పారు. సోనాలి బింద్రే హిందీలో నటించిన అన్ని సినిమాలు తో పాటు తెలుగులో నాగార్జున పక్కన నటించిన మన్మధుడు సినిమాను చాలాసార్లు చూశానని అరవింద్ తెలిపారు.

ఏది ఏమైనా పొలిటికల్ సెలబ్రిటీలలో కూడా నాని సినిమాలకు అంత ఫ్యాన్స్ అంటే నాని నిజంగా తన నటనతో వారిని ఎంతలా ఆకట్టుకున్నాడో తెలుస్తోంది. ఇక నాని తాజాగా న‌టించిన హాయ్ నాన్న సినిమా వ‌చ్చే నెల 7వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నానికి జోడీగా మృణాల్ ఠాగూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news