Newsశంకర్‌ను వీపీని చేసేలా మాట్లాడిన రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్‌కు ఘోర...

శంకర్‌ను వీపీని చేసేలా మాట్లాడిన రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్‌కు ఘోర అవమానం…!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా అందుకుంది. తనకు వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ కంటిన్యూ చేసే క్రమంలో రామ్‌చరణ్, దిల్ రాజు బ్యానర్‌లో శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ అప్పుడెప్పుడో రెండున్నర సంవత్సరాల క్రితం ప్రారంభమైంది.

షెడ్యూల్ ప్రకారం అన్ని జరిగి ఉంటే ఈపాటికి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆరు నెలలు అయ్యేది. అయితే శంకర్.. కమలహాసన్ హీరోగా ఇండియన్ 2 సినిమా కూడా తెరకెక్కిస్తున్నారు. ఇటు రామ్‌చరణ్ సినిమా, అటు ఇండియన్ 2 సినిమా షూటింగ్‌లు వేటికి సరిగా న్యాయం చేయటం లేదు శంకర్. ఇటు రామ్‌చరణ్ కూడా శంకర్ సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాలు పాటు డేట్లు కేటాయించి అలా ఉండిపోయాడు. ఈ సినిమా తర్వాత ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది.

ఆ సినిమా ఎప్పుడు ? పట్టాలెక్కుతుందని రామ్ చరణ్ ఒక్కటే ఎదురుచూస్తున్నాడు. అయితే శంకర్‌ మాత్రం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఒక పట్టాన‌ ముందుకు కదలనియటం లేదు. రామ్ చరణ్‌కు సైతం సహనం నశించి విసుగు వచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో ? కూడా తెలియటం లేదట. శంకర్ బాగా సాగదీస్తూ షూటింగ్ చేస్తుండడంతో అటు నిర్మాత దిల్ రాజు తో పాటు ఇటు హీరో రామ్ చరణ్ ఇద్దరూ కూడా పైకి చెప్పుకోకపోయినా శంకర పై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

చరణ్ అయితే యూనిట్‌లోనే శంకర్‌తో సినిమా చేయడం కంటే ఇంట్లో ఖాళీగా ఉండటం బెటర్ అని సెటైర్లు వేసినట్టు కూడా తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేస్తామని చెప్పినా అప్పటికైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటే సందేహంగానే కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news