Newsప్రభాస్ సాహో లో జాక్వలిన్ చేసిన ఐటమ్ సాంగ్ మిస్ చేసుకున్న...

ప్రభాస్ సాహో లో జాక్వలిన్ చేసిన ఐటమ్ సాంగ్ మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

నార్త్ ఇండియన్ ముద్దుగుమ్మ అయిన కాజల్ తెలుగులో పెళ్లయ్యాక కూడా హిట్లతో దూసుకుపోతోంది. తాజాగా ఆమె పెళ్లయ్యాక బాలయ్యకు జోడిగా చేసిన భగవంత్‌ కేసరి సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఆమె రీఎంట్రీతో తిరుగులేని సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. కాజల్‌కు లైఫ్ ఇచ్చిన దర్శకుడు తేజ.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఆమెను తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం చేశాడు.

అందుకే తేజ ఎప్పుడు తన సినిమాలో నటించమని అడిగినా కాజల్ మాత్రం నో చెప్పదు. ప్లాపుల్లో ఉన్న తేజను నమ్మి తనకంటే క్రేజ్‌లో చాలా తక్కువ అయినా రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించింది. ఆ వెంటనే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన సీత సినిమాలోను తేజ కోరిక మేరకు హీరోయిన్గా చేసింది. ఇక కాజల్ తెలుగులో చాలామంది హీరోలకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఆమె స్టార్ హీరోలు అందరితోనూ నటించి సూపర్‌హిట్లు కొట్టింది.

ప్రభాస్ తో కాజల్‌ది అదిరిపోయే కాంబినేషన్. ఈ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన రెబల్ సినిమాలోని కాజల్‌ను హీరోయిన్గా తీసుకోవాలని అడిగిన అప్పుడు ఆమె కాల్షిషీట్లు ఖాళీ లేక ఆ సినిమా చేయలేదు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా సాహూలో జాక్వ‌లిన్ చేసిన ఐటెం సాంగ్ కోసం ముందుగా కాజాల్‌ను సంప్రదించారట.

అయితే ఆ ఐటెం సాంగ్ లో నటించేందుకు ఆమె నో చెప్పింది. ఆ సాంగ్‌లో కాజల్ చేసి ఉంటే కచ్చితంగా మంచి క్రేజ్ వ‌చ్చేద‌ని చెప్పాలి. ఇక తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును ప్రేమ వివాహం చేసుకున్న కాజల్ దంపతులకు ఇటీవల నీల్ అనే కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news