Newsఅప్ప‌ట్లో ఆ హీరోయిన్ చుట్టూ నాగార్జున ఎన్ని సార్లు తిరిగినా వ‌ర్క‌వుట్...

అప్ప‌ట్లో ఆ హీరోయిన్ చుట్టూ నాగార్జున ఎన్ని సార్లు తిరిగినా వ‌ర్క‌వుట్ కాలేదా… !

తెలుగులో కింగ్ గా, మన్మధుడుగా పేరున్న సీనియర్ హీరో నాగార్జున. కెరీర్ ప్రారంభంలో అనుకున్న సక్సెస్‌లు దక్కలేదు. నాగార్జున సినీ కెరీర్ సాలీడ్ గా టర్న్ అయిందీ అంటే రాంగోపాల్ వర్మ దర్శకుడిగా మారుతూ చేసిన శివ సినిమా. ఈ సినిమా తర్వాత నాగార్జున నిర్మాతగా హీరోగా గట్టిగా నిలదొక్కుకున్నాడు.

నాగార్జునకి సొంత స్టూడియోతో పాటు ఇతర వ్యాపారాలు ఉండటం వల్ల బాలీవుడ్ సర్కిల్ బాగా పెరిగింది. దాంతో అక్కడ స్టార్స్ గా వెలుగుతున్న టబు, సుస్మితా సేన్, శిల్పాశెట్టి, దీప్తి భట్నాకర్..లాంటి వాళ్ళు నాగార్జున సరసన నటించడానికి ఆసక్తి చూపించారు. నాగార్జున కూడా ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయడానికి ట్రై చేశారు.

అయితే, అప్పట్లో నాగార్జున బాగా క్రేజీగా ఫీలైంది కరీనా కపూర్ అని టాక్ ఉంది. జబ్ వి మెట్ సినిమా తర్వాత కరీనాకి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. అందరూ పెద్ద స్టార్స్ తోనే నటించే అవకాశాలు అందుకుంది. అదే సమయంలో నాగార్జున కరీనా కపూర్ ని టాలీవుడ్ కి తీసుకురావాలని తెగ ట్రై చేశారట. కరీనా కపూర్ కోసం బాలీవుడ్ కి కూడా నాగార్జున చాలాసార్లు తిరిగారట.

కరీనా అనుకున్న రెమ్యునరేషన్ కంటే నాగార్జున ఎక్కువ ఇస్తా అని కూడా ఆఫర్ చేశారట. కానీ, కరీనా నాగార్జున సినిమాని ఎందుకనో రిజెక్ట్ చేసిందట. అప్పట్లో కరీనా బిజీగా ఉండటం ఒకటైతే బాలీవుడ్ లో స్టార్స్ గా వెలుగుతూ నాగార్జున సినిమాతో టాలీవుడ్ కి వచ్చిన వారు సక్సెస్ కాకపోవడం ఇంకో కారణం అని చెప్పుకున్నారు. ఏదేమైనా నాగార్జున-కరీనా కపూర్ కాంబినేషన్ సెట్ కాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news