News' గ‌మ్యం ' సినిమాకు ముందు అనుకున్న ఆ స్టార్ హీరోలు...

‘ గ‌మ్యం ‘ సినిమాకు ముందు అనుకున్న ఆ స్టార్ హీరోలు వీళ్లే…!

క్రిష్ దర్శకుడిగా పరిచయమైన సినిమా గమ్యం. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో అందరూ ఆయన గురించి మాట్లాడుకున్నారు. తెలుగు ఇండస్ట్రీకి మరో గొప్ప దర్శకుడు వచ్చాడని ప్రశంసించారు. ఎందుకంటే గమ్యం కథ అలాంటిది. దాన్ని ఢీల్ చేసిన క్రిష్ టాలెంట్ అటువంటిది. అయితే, ఈ సినిమా కోసం ముందు క్రిష్ పెద్ద హీరోలను ట్రై చేశారట.

వారిలో అల్లు అర్జున్, మంచు మనోజ్, రవితేజ, వెంకటేశ్, రానా లాంటి వారు ఉన్నారట. కానీ, వీళ్ళెవరూ గమ్య సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. కథ బావుందని చెప్పిన ఈ హీరోలే సినిమా చేయడానికి మాత్రం కొత్త దర్శకుడని ధైర్యం చేయలేకపోయారట. దాంతో గాలి శీను క్యారెక్టర్ కి అల్లరి నరేశ్, మేయిన్ హీరో రోల్ కోసం శర్వానంద్ ని ఎంచుకున్నాడు.

హీరోయిన్‌గా కూడా పెద్దవాళ్ళని అనుకొని వాళ్ళెవరూ క్రిష్ కి డేట్స్ ఇవ్వకపోయేసరికి ఫైనల్ గా పెద్ద క్రేజ్ లేకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న కమిలినీ ముఖర్జీని తీసుకున్నాడు. ఫైనల్ గా గమ్యం సినిమా రిలీజైంది. ఫస్ట్ డే టాక్ కొంచం డివైడ్ గానే వచ్చింది. కానీ, రెండవ రోజునుంచి ఇండస్ట్రీ వారిని బాగా ఆకట్టుకుంది. అలాగే ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించింది.

అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వారం తర్వాత లేపేద్దాం లే అనుకొని తీసుకున్న దేవీ థియేటర్ లో ఈ సినిమా 100 రోజులు ఆడటం. అంతేకాదు, ఈ కథ చేయనన్న వాళ్ళే మళ్ళీ కథ ఉంటే చేద్దాం అని క్రిష్ కి ఆఫర్ ఇవ్వడం. క్రిష్ కాంప్రమైజ్ చేసిన శర్వానంద్, అల్లరి నరేశ్ ల వల్లే గమ్యం డీసెంట్ హిట్ సాధించింది. నిజంగా మంచు మనోజ్ గనక గమ్యం సినిమాలో గాలి శీను రోల్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇంత సక్సెస్ అయితే అయ్యేది కాదు. తెలుగులో సక్సెస్ అయిన గమ్యం ఆ తర్వాత తమిళ, బెంగాలి, కన్నడ భాషలలో రీమేక్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news