Newsశోభ‌న పెళ్లైన‌ ఆ స్టార్ హీరో ప్రేమ‌లో ప‌డి పెళ్లికి దూర‌మైందా...!

శోభ‌న పెళ్లైన‌ ఆ స్టార్ హీరో ప్రేమ‌లో ప‌డి పెళ్లికి దూర‌మైందా…!

శోభ‌న‌.. ఈ పేరు విన‌గానే అచ్చ‌తెలుగు అమ్మాయే అనుకుంటారు. ఆమె అభిన‌యం.. డ్యాన్స్‌. మాట‌. కూడా అలానే ఉంటాయి. ముఖ్యంగా భ‌ర‌త నాట్యంలో శోభ‌న‌కు మంచి పేరు వ‌చ్చింది. చిరంజీవితో న‌టించిన చిత్రాల్లో శోభ‌న‌కు మంచి పేరు కూడా వ‌చ్చింది. ఆమెను తెలుగు న‌టి అనుకున్నా.. వాస్త‌వానికి ఆమె కేర‌ళ కు చెందిన న‌టి. అక్కడ అగ్ర‌తార‌గా ఉన్న రోజుల్లోనే బాలచంద‌ర్ తెలుగు చిత్ర‌సీమ స‌హా త‌మిళ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు.

ఇలా.. తెలుగులో మంచి మంత్రి పాత్ర‌లు ద‌క్కించుకున్న శోభ‌నకు ఏప్రిల్ 1 విడుద‌ల మ‌రింత పేరు తెచ్చింది. బోల్డ్ క్యారెక్ట‌ర్ల పాత్ర‌ల‌కు కూడా శోభ‌న స‌రిపోతార‌నే పేరు వ‌చ్చింది. ఇక‌, ఆమె ఇప్ప‌టికీ వివాహం చేసుకోలేదు. కేర‌ళ‌, చెన్నైల‌లో ఆమె నాట్యాల‌యాలు న‌డుపుతున్నారు. బ్యాచిల‌ర్‌గానే జీవితాన్ని ముగిస్తాన‌ని కూడా ఆమె చెబుతున్నారు. నిజానికి శోభ‌న కుటుంబ స‌భ్యులు.. ఆమెకు వివాహం చేయాల‌ని అనుకున్నార‌ట‌.

కానీ, మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి-శోభ‌నల మ‌ధ్య ప్రేమ ఉండ‌డం.. దానిపై అనేక గ్యాసిప్‌లు రావ డం.. కొన్నాళ్లు ఇద్ద‌రూ సినిమాలకు దూరంగా ఉండ‌డం అప్ప‌ట్లో ఒక హిస్ట‌రీగా ఉండేది. అయితే..ఇదే ప‌రిశ్ర‌మ‌కు చెందిన మోహ‌న్‌లాల్‌.. ఈ గ్యాసిప్‌ల‌ను తిప్పికొట్టారు. కానీ, వారి ప్రేమ‌ను మాత్రం కాద‌న‌లేక పోయారు. అయితే.. అప్ప‌టికే మ‌మ్ముట్టికి వివాహం జ‌రిగిపోవ‌డం గ‌మ‌నార్హం.

పైగా ఆయ‌న ముస్లిం కావ‌డం.. శోభ‌న సంప్ర‌దాయ కేర‌ళ కుటుంబానికి చెందిన న‌టి కావ‌డంతో ఆమె మౌనంగా ఉండిపోయారు. ప్ర‌స్తుతం ఆమె వ్యాపకం అంతా.. డ్యాన్సే. ఇప్ప‌టికి త్యాగ‌రాజ‌స్వామి కృతుల‌ను 500ల‌కు పైగా న‌టించారు. దేశ విదేశాల్లో ఆమె నృత్యానికి ఎన‌లేని డిమాండ్ ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఆ సొమ్మును ఆమె కేర‌ళ‌లోని చారిటీల‌కు ఇచ్చేస్తున్నారు. ఇదీ.. సంగ‌తి!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news