Newsమహేష్‌బాబు చేయి పడి టాలీవుడ్‌లో అడ్రస్ లేకుండా పోయినా కత్తిలాంటి హీరోయిన్...!

మహేష్‌బాబు చేయి పడి టాలీవుడ్‌లో అడ్రస్ లేకుండా పోయినా కత్తిలాంటి హీరోయిన్…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో తను నటించిన సినిమాలను చూసుకుంటే ఒక సినిమా హిట్ అయితే ఆ తర్వాత సినిమా ఫ్లాపైయ్యేది. ఆ తర్వాత ఒకటి హిట్ అయితే రెండు ఫ్లాపయ్యేవి. ఇలా మహేశ్ సినీ కెరీర్ సాగింది. ఆ తర్వాత కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాడు. మహేశ్ బాబు కెరీర్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సినిమా పోకిరి. అంతకముందు మురారి.

అయితే, పోకిరి సినిమా తర్వాత మహేశ్ నటించిన సైనికుడు భారీ డిజాస్టర్. మహేశ్-గుణశేఖర్ కాంబోలో వచ్చిన ఒక్కడు భారీ హిట్ కావడంతో ఇదే కాంబినేషన్‌లో సైనికుడు తీసి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అథిది సినిమా వచ్చింది. ఈ సినిమాతో టాలీవుడ్ కి అమృతా రావు హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ బ్యూటీ మహేశ్ కి తెగ నచ్చేసింది.

కానీ, తెలుగులో అమృతా రావు నటించిన మొదటి సినిమా డిజాస్టర్ కావడంతో మళ్ళీ కనిపించలేదు. బాలీవుడ్ లో వివాహ్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. అక్కడ అమృతా రావు కి మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ చూసే తెలుగులో అథిది సినిమాలో చాన్స్ ఇచ్చారు. కానీ, బ్యాడ్ లక్ ఈ సినిమా ఫ్లాప్ కారణంగా అమృతా రావు సౌత్ లో మళ్ళీ అవకాశాలు అందుకోలేకపోయింది.

అదే తెలుగులో కూడా వివాహ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి ఉంటే అమృతా రావు అందానికి ఫిజిక్ కి సౌత్ భాషలైన తెలుగు, తమిళంలో మంచి క్రేజీ హీరోయిన్‌గా వెలిగేది. చాలామంది హీరోయిన్ మహేశ్ సరసన ఛాన్స్ అని సంబరపడటం అది కాస్త బాక్సాఫీస్ వద్ద తిరగబడటంతో మళ్ళీ తెలుగులో అవకాశాలు లేక అడ్రస్ లేకుండా పోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news