Newsస్టార్ డైరెక్టర్ ని నమ్మించి చీట్ చేసిన కీర్తి సురేష్.. తెలుగు...

స్టార్ డైరెక్టర్ ని నమ్మించి చీట్ చేసిన కీర్తి సురేష్.. తెలుగు దర్శకుడు అంటే అంత చులకనా మేడమ్..?

కీర్తి సురేష్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . మహానటిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ఈ కాలం జనరేషన్ అందరూ హద్దులు మీరు పోయి నటిస్తున్న సరే కీర్తి సురేష్ ఎక్కడ కూడా తన హద్దులు మీరకుండ పద్ధతిగా ఉంటూనే పద్ధతిగల రోల్స్ చూస్ చేసుకుంటూ టాప్ హీరోయిన్గా ఎదిగిపోయింది . అయితే ఇప్పుడిప్పుడు అవకాశాలు లేక ఆమె హద్దులు మీరాల్సి వస్తుంది . తాజాగా కీర్తి సురేష్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

కీర్తి సురేష్ నాని జంటగా నటించిన సినిమా దసరా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. నాని కెరియర్ లోనే 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది . అయితే ఈ సినిమా కోసం ముందుగా హీరోయిన్గా చాలామంది బ్యూటీస్ ని సెలెక్ట్ చేసుకున్నాడట డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల . అయితే అందరిలోకి కీర్తి సురేష్ అయితే బాగుంటుంది అంటూ కానీ కీర్తి సురేష్ కొంచెం బరువు పెరగాలి ఈ పాత్ర కోసం అంటూ సజెస్ట్ చేశారట.

కీర్తి సురేష్ కూడా నాని సలహా మేరకు ఈ సినిమాని యాక్సెప్ట్ చేసి బరువు పెరుగుతాను అంటూ అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేసిందట . కానీ సినిమా షూటింగ్ టైం వచ్చేసరికి కీర్తి సురేష్ బరువు పెరగలేదు . ఎంత బరువు ఉండిందో అంతే బరువును మెయింటైన్ చేస్తూ వచ్చింది. దీంతో కోప్పడిన శ్రీకాంత్ ఓ దెల నాని వద్దకు వెళ్లి అన్న ఈ హీరోయిన్ మనకొద్దు మార్చేద్దాం అంటూ చెప్పుకొచ్చాడట . దీంతో నాని “ఏం మాట్లాడుతున్నావ్ .. అక్కడ నేషనల్ అవార్డు విన్నర్.. ఫస్ట్ టాలెంట్ చూడు .. ఆ తర్వాత మిగతావి ” అంటూ నాని సలహా మేరకు ఓ ఛాన్స్ ఇద్దామని రెండు షాట్స్ చేపించాడట . దీంతో ఆమె నటనకు ఫిదా అయిన శ్రీకాంత్ ఓదెలా బరువు పెరగకపోయిన పర్లేదు మీరే మా సినిమాలో హీరోయిన్ అంటూ ఫిక్స్ అయిపోయాడు. అంతేకాదు ప్రతి సీను ఒకే ఒక షాట్లో ఫైనల్ అవుట్ ఫుట్ ఇచ్చేసిందట మహానటి ఈ కీర్తి సురేష్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news