Newsఅఖిల్ స్టార్ హీరో అవ్వ‌డానికి ప‌వ‌న్‌కు, మ‌హేష్‌కు లింక్ ఉందా......

అఖిల్ స్టార్ హీరో అవ్వ‌డానికి ప‌వ‌న్‌కు, మ‌హేష్‌కు లింక్ ఉందా… ఇదేం ట్విస్ట్ నాయ‌నో…!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలామంది స్టార్ హీరోలకు ఇప్పటికే పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసింది. పాన్ ఇండియా గుర్తింపుతో ఈ స్టార్ హీరోలు ఇతర రాష్ట్రాలలో సైతం అభిమానులను సొంతం చేసుకోవడంతో పాటు తమ సినిమాలకు 200 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే మహేష్, పవన్ లకు మాత్రం పాన్ ఇండియా గుర్తింపు దక్కాల్సి ఉంది.

జక్కన్న సినిమాతో మహేష్ బాబు, హరిహర వీరమల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ ఈ స్టేటస్ ను సొంతం చేసుకుంటారని అభిమానులు ఫీలవుతున్నారు. అయితే మహేష్ బాబు, పవన్ తలచుకుంటే అఖిల్ స్టార్ హీరో కావడం గ్యారంటీ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటివరకు ఐదు సినిమాలలో హీరోగా నటించిన అఖిల్ కు ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్ హిట్ దక్కలేదు. పాన్ ఇండియా హీరోగా అఖిల్ కు గుర్తింపు రావడం సులువు కాదు.

అయితే పవన్, మహేష్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో అఖిల్ సెకండ్ హీరోగా నటించినా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కే అవకాశం ఉంది. అఖిల్ ఈ దిశగా అడుగులు వేస్తే కెరీర్ వేగంగా పుంజుకుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్, తారక్, చరణ్, బన్నీలకు ఇప్పటికే పాన్ ఇండియా స్టేటస్ వచ్చిన నేపథ్యంలో అఖిల్ మహేష్, పవన్ లతో స్క్రీన్ షేర్ చేసుకునే దిశగా ప్లాన్ చేస్తే ఊహించని రేంజ్ లో మార్కెట్ పెరుగుతుంది.

ఒకవైపు సోలో హీరోగా సినిమాలలో నటిస్తూనే మరోవైపు అఖిల్ ఈ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అఖిల్ వయస్సు 29 సంవత్సరాలు కాగా అఖిల్ వేసే ప్రతి అడుగు అతని కెరీర్ కు కీలకం కానుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో చరణ్, తారక్ కలిసి నటించి స్టార్ స్టేటస్ ను అందుకోగా మహేష్ లేదా పవన్ తో కలిసి నటించే దిశగా అక్కినేని హీరో అడుగులు పడతాయో లేదో చూడాలి. అఖిల్ కు 2024 సంవత్సరంలో అయినా భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని ఆశిద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news