Newsఆ స్టార్ హీరో సినిమాకు కెమేరామెన్‌గా ప‌నిచేసిన బాల‌య్య‌... ఎవ‌రా స్టార్...

ఆ స్టార్ హీరో సినిమాకు కెమేరామెన్‌గా ప‌నిచేసిన బాల‌య్య‌… ఎవ‌రా స్టార్ హీరో… ఆ సినిమా ఏదంటే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే మొదట బాల నటుడుగా తన తండ్రితో కలిసి మొదలుపెట్టిన బాలయ్య ఆయన దర్శకత్వంలో కూడా పనిచేయడం జరిగింది. హీరో అయిన తర్వాత కూడా బాలయ్య ఎన్టీఆర్ తో కలిసి పల సినిమాలలో నటించారు. వాటిలో ఒకటి.. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సినిమా ఈ చిత్రం ఎన్టీఆర్ టైటిల్ పాత్రను పోషించగా బాలయ్య ఆయన శిష్యుడు సిద్ధప్ప పాత్రలో నటించారు.

బాలయ్య తండ్రి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలైన సినిమా ఇది కమర్షియల్ గా ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. దాదాపుగా 4కోట్ల రూపాయల వరకు ఈ సినిమా కలెక్షన్ సాధించినట్లు సమాచారం. ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులకు ఇప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కూడా దర్శకత్వం వహించారట. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కావాల్సి ఉండగా సెన్సార్ సభ్యుల కొన్ని సన్నివేశాలను అభ్యంతరం చేయడంతో ఈ సినిమాని నిలిపివేసి తన ప్రభుత్వం వచ్చినప్పుడు విడుదల చేస్తానని చెప్పి విడుదల చేశారట. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సమయంలో బాలయ్యకి ఎన్టీఆర్ దర్శకత్వంలో ఎలా ఉండాలో నేర్పించారట.. షార్ట్ మేకింగ్ ఎలా చేయాలి కెమెరా యాంగిల్స్ ని ఎలా పెట్టుకోవాలి అనే విషయం పైన అవగాహన కూడా కల్పించారట.

ఒక్క సినిమాలో నటిస్తూ ఉండగా ఒకపక్క ఎన్టీఆర్ దర్శకత్వం వహిస్తూ ఉండగానే ఎన్నో సన్నివేశాలకు బాలయ్య కెమెరామెన్ గా కూడా పనిచేసినట్లు సమాచారం. అలా బాలకృష్ణ కెరియర్ మొత్తంలో కెమెరామెన్ గా పనిచేసిన ఏకైక సినిమా ఇదే అని చెప్పవచ్చని తెలుపుతున్నారు అభిమానులు. ఈ సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వాన్ని సైతం మెచ్చుకోవడం జరిగింది. బాలయ్య కూడా అద్భుతంగా నటించారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి మార్కులే పడ్డాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news