Movies"ఇక ఆపండ్రా చాలు"..అభిమానుల గుండెలు ముక్కలైయే వార్త చెప్పిన సుడిగాలి సుధీర్..!

“ఇక ఆపండ్రా చాలు”..అభిమానుల గుండెలు ముక్కలైయే వార్త చెప్పిన సుడిగాలి సుధీర్..!

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ జంటలకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో బుల్లితెరపై అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సుధీర్ – రష్మీ . వీళ్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . పెళ్లి చేసుకోలేదు కానీ వీళ్ళు పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానుల కోరిక . వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ వార్త వినాలి అంటూ ఎంతోమంది ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క శెట్టి ప్రభాస్ ల పెళ్లి కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అంతకు సరి సమానంగా సుధీర్ రష్మీ పెళ్లి వార్త వినడానికి ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .

అయితే రీసెంట్గా అభిమానుల గుండె బద్దలు అయ్యే వార్తలు వినిపించాడు సుధీర్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశంలో మాట్లాడిన సుధీర్ కు రష్మి పై ప్రశ్న ఎదురైంది . మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు..? మీ పెళ్లి రష్మితోనే జరుగుతుందా..? అంటూ మీడియా వాళ్ళు ప్రశ్నించారు . దీంతో ఫైనల్లీ క్లారిటీ ఇచ్చేసాడు సుధీర్ .

“ఇప్పటికే నేను ఈ విషయం చాలా సార్లు చెప్పాను. మాది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీనే ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కాదు.. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. మీరు ఎన్ని సార్లు అడిగినా నా సమాధానం ఇదే .. అంతే కాదు అసలు నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు . కెరియర్ ఫ్యామిలీ వైపే నాకు దేవుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఆయన నాకు పెళ్లిపై ఇంట్రెస్ట్ కలగజేస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా.. అప్పటివరకు నాకు పెళ్లి ధ్యాసే లేదు అంటూ సుధీర్ చెప్పుకొచ్చారు”. దీంతో ఫ్యాన్స్ ఫుల్ డీలా పడిపోయారు. ఇన్నాళ్లు కనీసం రష్మిని కాకపోయినా వేరే ఎవరినైనా చేసుకుంటాడేమో అనుకున్నామని . అసలు ఆయనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అని తేల్చేశాడు అని తెగ బాధ పడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news