Moviesక‌ళ్యాణ్‌రామ్ ' డెవిల్ ' కొత్త రిలీజ్ డేట్ వ‌చ్చేసింది... మ‌రో...

క‌ళ్యాణ్‌రామ్ ‘ డెవిల్ ‘ కొత్త రిలీజ్ డేట్ వ‌చ్చేసింది… మ‌రో నంద‌మూరి పండ‌గ ఎప్పుడంటే..!

నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత ఈ యేడాది అమిగోస్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. అమిగోస్ వైవిధ్య‌మైన సినిమా అయినా ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకోలేక‌పోయింది. అయితే ఇప్పుడు క‌ళ్యాణ్‌రామ్ డెవిల్ అనే మ‌రో కొత్త కాన్సెఫ్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యిన ఈ సినిమా న‌వంబ‌ర్ 24న రిలీజ్ చేయాల‌ని ముందుగా అనుకున్నారు. అయితే అనివార్య కార‌ణాల‌తో ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా ప‌డింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. డిసెంబర్ నెలాఖరులో డెవిల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

డిసెంబ‌ర్ 29న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్టుగా స‌మాచారం. ఆ త‌ర్వాత సంక్రాంతి సినిమాలు ఉంటాయి. అందుకే డిసెంబ‌ర్ 29న ఈ సినిమా రిలీజ్ చేసేయాల‌ని మేక‌ర్స్ గ‌ట్టిగా నిర్ణ‌యం తీసుకున్నారు. సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను అభిషేక్ పిక్చ‌ర్స్ నిర్మాణం వ‌హిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news