Newsక‌ళ్యాణ్‌రామ్‌కు అత్త‌గా విజ‌య‌శాంతి... మ‌ర‌ద‌లు ఎవ‌రంటే...?

క‌ళ్యాణ్‌రామ్‌కు అత్త‌గా విజ‌య‌శాంతి… మ‌ర‌ద‌లు ఎవ‌రంటే…?

టాలీవుడ్ లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇటీవల అమీగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బింబిసార లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ ది సీక్రెట్ బ్రిటిష్ ఏజెంట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవుతుంది.

తాజాగా కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో 21వ సినిమాను ఓకే చేశారు. ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సినిమాను అశోక క్రియేషన్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. గతంలో నారా రోహిత్ – నందమూరి తారకరత్న ప్రధాన పాత్రలలో తెరకెక్కిన రాజ చెయ్యి వేస్తే సినిమాకి దర్శకత్వం వహించిన ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

విచిత్రం ఏంటంటే ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి – కళ్యాణ్ రామ్‌కు అత్తగా కీలకపాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కళ్యాణ్‌రామ్ బాబాయ్ బాలయ్య – విజయశాంతి కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరిది ఎంత గొప్ప హిట్ ఫెయిరో చెప్పక్కర్లేదు. అప్పుడు బాబాయితో నటించిన విజయశాంతి ఇప్పుడు అబ్బాయికి అత్తగా నటిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్గా స‌యి మంజ్రేక‌ర్‌ నటిస్తున్నారు. ఆమె విజయశాంతి కూతురుగా నటిస్తుందని సమాచారం. ఏది ఏమైనా కళ్యాణ్ రామ్ – విజయశాంతి కాంబినేషన్ సినిమాపై మంచి క్రేజ్ వచ్చింది. దీనికి తోడు తొలిసారిగా కళ్యాణ్ రామ్ కు జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ స‌యి మంజ్రేకర్ నటిస్తుండటం కూడా సినిమాకు ప్లస్‌ కానుంది. అంజనీష్‌ లోకనాథ్ సంగీతం అందించే ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news