Newsమెగాస్టార్ 156కు ఇంట్ర‌స్టింగ్ టైటిల్ ఫిక్స్‌... టైటిల్‌తోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టారుగా...!

మెగాస్టార్ 156కు ఇంట్ర‌స్టింగ్ టైటిల్ ఫిక్స్‌… టైటిల్‌తోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టారుగా…!

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి త‌న రేంజ్‌కు త‌గిన‌ట్టుగా సినిమా చేసేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రీ ఎంట్రీ త‌ర్వాత చిరు న‌టించిన వాల్తేరు వీర‌య్య సినిమా ఒక్క‌టి మాత్ర‌మే సూప‌ర్ హిట్‌. చిరు చేసిన నాలుగైదు సినిమాలు పెద్ద డిజాస్ట‌ర్లు అయ్యాయి. ఈ యేడాది సంక్రాంతికి వీర‌సింహారెడ్డి సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టిన చిరు ఆగ‌స్టులో భోళాశంక‌ర్ సినిమాతో పెద్ద డిజాస్ట‌ర్ త‌న ఖాతాలో వేసుకున్నారు.

ఇక భోళాశంక‌ర్ సినిమా తర్వాత చిరు త‌న త‌ర్వాత సినిమా కోసం కాస్త గ్యాప్ తీసుకున్నారు. మోకాలికి శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్న చిరు ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక చిరు 156వ సినిమాగా ముందు త‌న పెద్ద కుమార్తె కొణిదెల సుస్మిత నిర్మాణ సారథ్యంలో కుర‌సాల క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాకు ఓకే చెప్పారు.

అయితే ఈ సినిమా త‌ర్వాత చిరు 157వ సినిమాను బింబిసారా ఫేం మ‌ల్లిడి వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో సోషియో ఫాంట‌సీ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే ఇప్పుడు కుర‌సాల క‌ళ్యాణ్‌కృష్ణ సినిమాను ప‌క్క‌న పెట్టేసి… చిరు 156వ సినిమాగా వ‌శిష్ట సినిమాను తెరమీద‌కు తెచ్చారు. యూవీ క్రియేష‌న్స్ సంస్థ రు. 200 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించే ఈ భారీ బ‌డ్జెట్ సినిమా టైటిల్ విష‌యంలో ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ గా మారింది.

ఈ సినిమాకు ఓ ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉందంటున్నారు. ఈ సినిమాకు విశ్వంభ‌ర అనే క్రేజీ టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఇది నిజంగానే క్రేజీ టైటిల్ అని చెప్పాలి. ఈ సినిమాకు ఎంఎం. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జ‌రుగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news